భారీ ట్రేడింగ్‌తో కుప్పకూలిన షేర్లు!

భారీ ట్రేడింగ్‌తో కుప్పకూలిన షేర్లు!

మార్కెట్లు భారీ స్థాయిలో ఆటుపోట్లను చవిచూస్తున్న నేపథ్యంలో పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా ఎగసింది. జాబితాలో మ్యాగ్మా ఫిన్‌కార్ప్‌ లిమిటెడ్‌, అల్ఫాజియో ఇండియా లిమిటెడ్‌, ఎన్‌ఆర్‌బీ బేరింగ్‌ లిమిటెడ్‌, బ్లిస్‌ జీవీఎస్‌ ఫార్మా లిమిటెడ్‌ చోటుచేసుకున్నాయి. వీటిలో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించినట్లు వెలువడిన వార్తల నేపథ్యంలో అల్ఫాజియో ఇండియా లిమిటెడ్‌ కౌంటర్లో వరుసగా రెండో రోజు అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి రెండో రోజూ డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. షేర్ల తీరు, ట్రేడింగ్‌ పరిమాణం గమనిద్దాం..

మ్యాగ్మా ఫిన్‌కార్ప్‌ లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 9.5 శాతం కుప్పకూలి రూ. 67 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 66.5 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 41,000 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 16,000 షేర్లు చేతులు మారాయి.

అల్ఫాజియో ఇండియా: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 194 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం! ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1,450 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 40,000 షేర్లు చేతులు మారాయి.

ఎన్‌ఆర్‌బీ బేరింగ్‌ లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 75 దిగువన ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం! ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 6,000 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 6.92 లక్షల షేర్లు చేతులు మారాయి.

బ్లిస్‌ జీవీఎస్‌ ఫార్మా లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 95 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం! ఈ కౌంటర్‌లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 93,000 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 1.9 లక్షల షేర్లు చేతులు మారాయి.



Most Popular