ఎస్‌బీఐ- హెచ్‌డీఎఫ్‌సీ.. క్యూ1 రిలీజ్‌

ఎస్‌బీఐ- హెచ్‌డీఎఫ్‌సీ.. క్యూ1 రిలీజ్‌

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఓవైపు.. మరోపక్క ప్రయివేట్‌ రంగ మార్టిగేజ్‌ దిగ్గజం హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 0.8 శాతం బలపడి రూ. 320 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 322-312 మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ షేరు 2 శాతం ఎగసి రూ. 2128 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 2134-2039 వద్ద గరిష్ట, కనిష్టాలను తాకింది. ఫలితాలు చూద్దాం..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఎస్‌బీఐ స్టాండెలోన్‌ ప్రాతిపదికన రూ.  2,312 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2018-19) క్యూ1లో రూ. 4876 కోట్ల నికర నష్టం నమోదైంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 5 శాతం పెరిగి రూ. 22,939 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 7.53 శాతం వద్దే స్థిరంగా నమోదుకాగా.. త్రైమాసిక ప్రాతిపదికన నికర ఎన్‌పీఏలు 3.01 శాతం నుంచి 3.07 శాతానికి స్వల్పంగా పెరిగాయి. ఈ కాలంలో 3.01 శాతం నికర వడ్డీ మార్జిన్లు సాధించింది. కాగా.. ప్రొవిజన్లు రూ. 16502 కోట్ల నుంచి రూ. 9183 కోట్లకు తగ్గాయి. ఇవికాకుండా జీతాల ఎరియర్స్‌ కోసం రూ. 996 కోట్ల ప్రొవిజన్లు చేపట్టగా.. ఐబీసీ ఖాతాల కోసం రూ. 3553 కోట్లు హోల్డ్‌లో ఉంచినట్లు ఎస్‌బీఐ తెలియజేసింది. స్థూల స్లిప్పేజెస్‌ రూ. 16212 కోట్లకు చేరాయి. 

హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ రూ. 3203 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 46 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం 31 శాతం వృద్ధితో రూ. 12990 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం రూ. 3130 కోట్లకు చేరగా.. పెట్టుబడుల(గృహ ఫైనాన్స్‌) విక్రయంపై రూ. 1894 కోట్ల లాభం ఆర్జించింది. స్టాండెలోన్‌ ఫలితాలివి. కంపెనీ లోన్‌బుక్‌ 11 శాతం పుంజుకుని రూ. 4.16 లక్షల కోట్లకు చేరింది. స్థూల ఎన్‌పీఏలు 1.22 శాతం నుంచి 1.29 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు 3.3 శాతం వద్ద స్థిరంగా నమోదయ్యాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');