లోయర్‌ సర్క్యూట్లలోనే ఈ షేర్లు

లోయర్‌ సర్క్యూట్లలోనే ఈ షేర్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశ పరచడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ కేర్‌ రేటింగ్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇక 12 రోజులుగా నేలచూపులతోనే కదులుతున్న తల్వాల్కర్స్ గ్రూప్‌ స్టాక్స్‌ సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కాగా.. మరోవైపు ప్రమోటర్‌ వీజీ సిద్ధార్థ మరణంతో కుదేలైన కాఫీ రిటైల్‌ చైన్‌ స్టోర్ల సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టారు. ఇదే విధంగా సిద్ధార్థకు వాటా ఉన్న సికాల్‌ లాజిస్టిక్స్‌ కౌంటర్‌ సైతం భారీ అమ్మకాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం..

Image result for care ratings

కేర్‌ రేటింగ్స్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో పనితీరు నిరాశపరచడంతో వరుసగా రెండో రోజు కేర్‌ రేటింగ్స్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతా అమ్మేవాళ్లే మినహా కొనుగోలుదారులు కరువుకావడంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు మరోసారి 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 122 కోల్పోయి రూ. 487 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. గురువారం సైతం ఈ షేరు 20 శాతం కుప్పకూలిన సంగతి తెలిసిందే. కాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్)లో కేర్‌ రేటింగ్స్‌ నికర లాభం 46 శాతం నీరసించి రూ. 13.4 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం క్షీణించి రూ. 499 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్లు 45.6 శాతం నుంచి 20.1 శాతానికి పతనమయ్యాయి. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్‌ కంపెనీల రంగంలో కొద్ది నెలలుగా సమస్యాత్మక వాతావరణం నెలకొనడంతో బిజినెస్‌ నీరసించినట్లు కేర్‌ రేటింగ్స్‌ పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీల విభాగంలో రుణ కార్యకలాపాలు మందగించడంతో నిర్వహణ లాభంపై ప్రతికూల ప్రభావం పడినట్లు తెలియజేసింది.

Image result for talwalkars group

తల్వాల్కర్స్‌ గ్రూప్‌
గత కొద్ది రోజులుగా అమ్మకందారులే తప్ప కొనేవాళ్లు కరువుకావడంతో లోయర్‌ సర్క్యూట్లను తాకుతూ వస్తున్న తల్వాల్కర్స్‌ గ్రూప్‌ లిస్టెడ్‌ స్టాక్స్‌ రెండింట్లోనూ మరోసారి అమ్మకాలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో తల్వాల్కర్స్‌ బెటర్‌ వేల్యూ ఫిట్‌నెస్‌ షేరు 5 శాతం పతనమై రూ. 16.25 వద్ద ఫ్రీజయ్యింది. ఈ బాటలో తల్వాల్కర్స్‌ హెల్త్‌క్లబ్స్‌ సైతం 5 శాతం తిరోగమించి రూ. 30 దిగువన నిలిచింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ సరికొత్త కనిష్టాలకు చేరాయి. కాగా.. సుమారు రెండు వారాలుగా పతన బాటలో సాగుతున్న ఈ రెండు కౌంటర్లూ సగటున 65 శాతం వరకూ విలువ కోల్పోవడం గమనార్హం. తాజాగా రెండు కంపెనీలూ రుణ చెల్లింపుల్లో విఫలమైనట్లు వార్తలు వెలువడ్డాయి.

Image result for cafe Coffeeday

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌
కేఫ్‌ కాఫీ డే బ్రాండు రిటైల్‌ స్టోర్ల కంపెనీ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లో వరుసగా నాలుగో రోజు అమ్మకాలు పెరిగాయి. దీంతో ఈ కౌంటర్‌ ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం రూ. 11 శాతం పతనమై రూ. 99.5 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. కాఫీ డే బోర్డు ఇప్పటికే కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసుకుంది. కాగా.. సికాల్‌ లాజిస్టిక్స్‌ కౌంటర్లో కొనుగోలుదారులు కరువుకావడంతో  షేరు 10 శాతం దిగజారింది. రూ. 47 దిగువన ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. గత నాలుగు రోజుల్లోనూ ఈ రెండు కౌంటర్లూ సుమారు 45 శాతం పతనమయ్యాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');