ప్రపంచ మార్కెట్లకు ట్రంప్‌ షాక్‌

ప్రపంచ మార్కెట్లకు ట్రంప్‌ షాక్‌

ఇచ్చిన మాటను ఉల్లంఘిస్తూ చైనా తగినన్ని వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడంలేదంటూ తాజాగా అమెరికన్‌ ప్రెసిడెంట్ ట్రంప్‌ పేర్కొనడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు దెబ్బతగిలింది. షాంఘైలో మంగళవారం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య వాణిజ్య వివాద పరిష్కార చర్చలు ప్రారభమైన నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు ఫెడరల్‌ రిజర్వ్‌ రెండు రోజుల పాలసీ సమీక్షా సమావేశాలు మంగళవారమే ప్రారంభమయ్యాయి. నేడు నిర్ణయాలు వెలువడనున్నాయి. కనీసం సావు శాతం వడ్డీ రేట్ల కోత ఉండవచ్చంటూ ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. జూన్‌లో వినియోగ వ్యయాలు, ధరలు నామమాత్ర వృద్ధినే చూపినట్లు తాజాగా విడుదలైన వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రపంచ మార్కెట్లు వెనకడుగు వేశాయి. 

Image result for us president trump

నేలచూపుతో..
డోజోన్స్‌ 23 పాయింట్లు(0.1 శాతం) బలహీనపడి 27,198 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 8 పాయింట్లు(0.25 శాతం) క్షీణించి 3,013 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 20 పాయింట్లు(0.25 శాతం) వెనకడుగుతో 8,274 వద్ద స్థిరపడింది. ఈ బాటలో యూరోపియన్‌ మార్కెట్లలో జర్మనీ 2.2 శాతం, ఫ్రాన్స్‌ 1.6 శాతం, యూకే 0.5 శాతం చొప్పున తిరోగమించాయి. ఇక ప్రస్తుతం ఆసియాలోనూ బలహీన ధోరణి కనిపిస్తోంది. హాంకాంగ్‌, జపాన్‌, కొరియా, చైనా, తైవాన్‌ 1-0.6 శాతం మధ్య క్షీణించగా.. సింగపూర్‌ స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. థాయ్‌లాండ్‌ దాదాపు యథాతథంగా కదులుతోంది.

యాపిల్‌ అప్‌
క్యూ2 ఫలితాలు అంచనాలను మించడంతో ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ షేరు 3 శాతం ఎగసింది. సీఈవో టిమ్‌ కుక్‌ చైనాలో విక్రయాలు పెరిగినట్లు పేర్కొనడం ఈ కౌంటర్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ బాటలో గైడెన్స్‌ ఆకట్టుకోవడంతో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ప్రోక్టర్‌ అండ్‌ గేంబుల్‌(పీఅండ్‌జీ) 4 శాతం జంప్‌చేసింది. దీంతో బ్లూచిప్స్‌తో కూడిన డోజోన్స్‌ ఇండెక్స్‌ నష్టాలు తగ్గినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. క్రెడిట్‌ కార్డ్స్‌ జారీ చేసే కేపిటల్‌ వన్‌ ఫైనాన్షియల్‌ కార్ప్‌ 6 శాతం పతనమైంది. 10.6 కోట్లమంది వినియోగదారుల సమాచారంపై వివాదం ఈ కౌంటర్‌ను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. అప్‌జాన్‌ యూనిట్‌ను మైలాన్‌తో విలీనం చేయనున్నట్లు ప్రకటించడంతో వరుసగా రెండో రోజు ఫార్మా దిగ్గజం ఫైజర్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. బ్రోకింగ్‌ సంస్థలు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ఫైజర్‌ ఇంక్‌ 6.5 శాతం పతనమైంది. క్యూ2 ఫలితాలు, గైడెన్స్‌ ఆకట్టుకున్నప్పటికీ మెర్క్‌అండ్‌ కో షేరు స్వల్పంగా బలపడింది.
 
పౌండ్‌ పతన బాట
యూరోపియన్‌ యూనియన్‌తో డీల్‌ కుదరకుండానే బ్రిటన్‌ వైదొలగవలసి(బ్రెక్సిట్‌) వస్తుందన్న ఆందోళనల నడుమ బ్రిటిష్‌ పౌండ్‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. మరోపక్క బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ పాలసీ సమీక్షపై అంచనాలు సైతం ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెబతున్నారు. దీంతో డాలరుతో మారకంలో 1.212ను తాకింది. ఇది 28 నెలల కనిష్టంకాగా.. ఇంతక్రితం 2016 అక్టోబర్‌లో మాత్రమే స్టెర్లింగ్‌ ఈ స్థాయికి చేరింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 98.06కు చేరింది. డాలరుతో మారకంలో యూరో 1.115కు నీరసించగా.. జపనీస్‌ యెన్ 108.58 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');