ఈ షేర్లు- వ్యాల్యూమ్స్‌తో పతనం

ఈ షేర్లు- వ్యాల్యూమ్స్‌తో పతనం

మిడ్‌సెషన్‌ తదుపరి ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లు పతన బాట పట్టాయి. దీంతో ఇన్వెస్టర్లు కొన్ని ఎంపిక చేసిన మధ్య, చిన్నతరహా కౌంటర్లలో అమ్మకాలకు ఎగబడుతున్నారు. ఫలితంగా కొన్ని కౌంటర్లలో అమ్మకాల పరిమాణం సైతం పెరిగింది. వెరసి ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ కౌంటర్లు భారీ నష్టాలతో కళతప్పాయి. జాబితాలో.. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐఈడీ ప్యారీ ఇండియా, ఎన్‌బీసీసీ ఇండియా, సికాల్‌ లాజిస్టిక్స్‌, టెక్స్‌మాకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉన్నాయి. వివరాలు చూద్దాం..

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 12 శాతం కుప్పకూలి రూ. 397 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 385 వరకూ జారింది. తద్వారా ఈ షేరు 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం సగటున 2.9 లక్షల షేర్లుకాగా.. ఇప్పటివరకూ 12 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఐఈడీ ప్యారీ ఇండియా: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 11 శాతం పడిపోయి రూ. 141 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 136 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం సగటున 17,600 షేర్లుకాగా.. ఇప్పటివరకూ ఈ కౌంటర్‌లో 41,300 షేర్లు చేతులు మారాయి.

ఎన్‌బీసీసీ ఇండియా: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 12 శాతం దిగజారి రూ. 42 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 51 దిగువకు జారింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం! గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం సగటున 5.5 లక్షల షేర్లుకాగా.. ఇప్పటివరకూ ఈ కౌంటర్‌లో 11.5 లక్షల షేర్లు చేతులు మారాయి.

సికాల్‌ లాజిస్టిక్స్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 72.4 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. ఈ కౌంటర్లో అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరువయ్యారు. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం సగటున 1,700 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 9,600 షేర్లు చేతులు మారాయి.

టెక్స్‌మాకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 14 శాతం కుప్పకూలి రూ. 34 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 33 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్‌లో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం సగటు 2,400 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 9,000 షేర్లు చేతులు మారాయి.



Most Popular