ఇండియాబుల్స్‌ గ్రూప్‌- స్వామి షాక్‌

ఇండియాబుల్స్‌ గ్రూప్‌- స్వామి షాక్‌

పలు షెల్‌ కంపెనీలను సృష్టించడం ద్వారా రూ. లక్ష కోట్లకుపైగా నిధులను అక్రమంగా దారి మళ్లించినట్లు బీజేపీ పార్టీ రాజకీయవేత్త సుబ్రమణియన్‌ స్వామి ఆరోపించడంతో ఇండియాబుల్స్‌ గ్రూప్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ అంశాలపై దర్యాప్తు చేపట్టేందుకు వీలుగా సిట్‌ను ఏర్పాటు చేయవలసిందిగా ప్రధాని మోడీని అభ్యర్థిస్తూ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖ సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న నేపథ్యంలో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు ఇండియాబుల్స్‌ గ్రూప్‌ కౌంటర్లలో అమ్మకాలకు ఎగబడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు(ఎన్‌హెచ్‌బీ) నుంచి షెల్‌ కంపెనీల ద్వారా నిధులను సమీకరించి ఇండియాబుల్స్‌ గ్రూప్‌ అక్రమంగా మళ్లించినట్లు సుబ్రమణ్యన్‌ స్వామి ఆరోపించారు. మనీలాండరింగ్‌ స్కామ్‌గా పేర్కొంటూ ఈ అంశాలపై దర్యాప్తు కోసం సీబీఐ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐవో, ఐటీ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేయవలసిందిగా ప్రధాని మోడీని స్వామి కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇతర వివరాలు చూద్దాం..

పతన బాటలో
నేటి ట్రేడింగ్‌లో ఇండియాబుల్స్‌ గ్రూప్‌నకు చెందిన లిస్టెడ్‌ కంపెనీల కౌంటర్లు ఒక్కసారిగా అమ్మకాలతో డీలాపడ్డాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 8 శాతంపైగా పడిపోయి రూ. 573 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 562 వరకూ తిరోగమించింది. ఇక ఐబీ వెంచర్స్‌ 9 శాతం కుప్పకూలి రూ. 246 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 242 వరకూ దిగజారింది. ఈ బాటలో ఐబీ కన్జూమర్‌ ఫైనాన్స్‌ 3 శాతం క్షీణించి రూ. 920 వద్ద ట్రేడవుతోంది. ఇండియాబుల్స్‌ రియల్టీ 8.4 శాతం పతనమై రూ. 97 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 96 దిగువకు చేరింది. ఐబీ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ షేరు 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 121.55 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. ఎన్‌హెచ్‌బీ నుంచి ఎలాంటి రుణాలు.. లేదా రీఫైనాన్సింగ్‌కు నిధులను తీసుకోలేదని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు స్పష్టం చేయడం గమనార్హం!tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');