రెండో'సారీ'.. చిన్న షేర్లు బోర్లా

రెండో'సారీ'.. చిన్న షేర్లు బోర్లా

వరుసగా రెండో వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో డీలాపడ్డాయి. శుక్రవారంతో ముగిసిన గత వారం(15-19) మార్కెట్లు 1 శాతంపైగా నీరసించాయి. సెన్సెక్స్‌ 399 పాయింట్లు క్షీణించి 38,337 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 133 పాయింట్లు(1.2 శాతం) కోల్పోయి 11,419 వద్ద స్థిరపడింది. కాగా.. మార్కెట్లను మించుతూ మధ్య, చిన్నతరహా కౌంటర్లలో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 475 పాయింట్లు(3.3 శాతం) పతనమై 14,078 వద్ద నిలిచింది. ఈ బాటలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ సైతం 3.4 శాతం తిరోగమించి 13,310 వద్ద ముగిసింది.

Image result for yes bank
 
యస్‌ బ్యాంక్‌ పతనం 
బ్లూచిప్‌ కంపెనీలలో ఇన్ఫోసిస్‌ 8 శాతం జంప్‌చేయగా.. సన్ ఫార్మా, యూపీఎల్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ 3.4-2 శాతం మధ్య బలపడ్డాయి. అయితే యస్‌ బ్యాంక్‌ 12 శాతం, ఎంఅండ్‌ఎం 9 శాతం చొప్పున పతనంకాగా.. ఐషర్, హీరో మోటో, బజాజ్‌ ఆటో, ఇండస్‌ఇండ్‌, ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌, ఐసీఐసీఐ, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, వేదాంతా, యాక్సిస్‌, మారుతీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సిప్లా, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ 7-3 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

Image result for infosys

స్పార్క్ జూమ్
మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో స్పార్క్‌ 21 శాతం దూసుకెళ్లగా.. పీఅండ్‌జీ, ఇండిగో, గ్రీవ్స్‌ కాటన్‌, థెర్మాక్స్‌, జీఎస్‌పీఎల్‌, జేకే లక్ష్మీ, సీజీ పవర్‌, హాట్సన్‌ ఆగ్రో, ఫినోలెక్స్‌ తదితరాలు 10-4.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు కాక్స్‌అండ్‌ కింగ్స్‌, దివాన్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, మ్యాగ్మా ఫిన్‌, డీసీబీ బ్యాంక్‌, టాటా ఎలక్సీ, రిలయన్స్ ఇన్‌ఫ్రా, హెచ్‌ఈజీ, మన్‌పసంద్‌, కేఆర్‌బీఎల్‌, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, నోసిల్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, టైమ్‌టెక్నో, ఐబీ ఇంటి, శంకర, ఎడిల్‌వీజ్‌, ఎన్‌ఎల్‌సీ, మేఘమణి, పీసీ, ఆర్‌కేపిటల్‌ తదితరాలు 22-12 శాతం మధ్య పతనమయ్యాయి.