చివర్లో పతనం- బ్యాంక్స్‌, ఆటో బేర్‌

చివర్లో పతనం- బ్యాంక్స్‌, ఆటో బేర్‌

అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు తాజాగా అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లను కుంగదీస్తున్నాయి. దీంతో బుధవారం అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు డీలాపడగా.. నేటి ట్రేడింగ్‌లో ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. ఈ ప్రభావంతో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం బలహీనంగా ప్రారంభమయ్యాయి. మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో చివర్లో మార్కెట్లు పతనబాట పట్టాయి. వెరసి ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 39,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 318 పాయింట్లు పతనమై 38,897 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 91 పాయింట్లు బలహీనపడి 11,597 వద్ద స్దిరపడింది. 

నేలచూపులో
ఎన్‌ఎస్‌ఈలో మీడియా మినహా అన్ని రంగాలూ నీరసించగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌, ఆటో, రియల్టీ, ఫార్మా 3.2-1.3 శాతం మధ్య క్షీణించాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టాక్స్‌లో బీవోబీ, కెనరా, అలహాబాద్‌, ఓబీసీ, బీవోఐ, యూనియన్‌, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, ఇండియన్‌, సిండికేట్‌, జేఅండ్‌కే 5-1.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఆటో కౌంటర్లలో భారత్‌ ఫోర్జ్‌, అశోక్‌ లేలాండ్‌, టాటా మోటార్స్‌, మారుతీ, అపోలో టైర్స్‌, బాష్‌, బజాజ్‌ ఆటో, టీవీఎస్‌, ఎక్సైడ్‌, ఎంఅండ్‌ఎం, అమరరాజా, హీరో మోటో, మదర్‌సన్‌ 5.5-1.5 శాతం మధ్య పతనమయ్యాయి.

మెటల్‌, రియల్టీ వీక్‌
మెటల్‌ కౌంటర్లలో కోల్‌ ఇండియా, సెయిల్‌, ఏపీఎల్‌, వేదాంతా, హింద్‌ జింక్‌, నాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హింద్‌ కాపర్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌ 4.4-1.5 శాతం మధ్య నష్టపోయాయి. ఇక రియల్టీ కౌంటర్లలో డీఎల్‌ఎఫ్‌, ఇండియాబుల్స్‌, మహీంద్రా లైఫ్‌, శోభా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఫీనిక్స్‌ 3.6-1 శాతం మధ్య డీలాపడగా.. ఒబెరాయ్‌ 2 శాతం ఎగసింది. కాగా.. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 13 శాతం కుప్పకూలగా.. ఓఎన్‌జీసీ, గ్రాసిమ్‌, సిప్లా 4.5-2 శాతం మధ్య క్షీణించాయి. బ్లూచిప్స్‌లో విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, జీ, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మాత్రమే 3.2-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. 

మైండ్‌ట్రీ పతనం
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో మైండ్‌ట్రీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఐడియా 8-5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా..  మరోవైపు డిష్‌ టీవీ, కాల్గేట్‌, జస్ట్‌డయల్‌, పేజ్‌, ఎంసీఎక్స్‌, ఒరాకిల్‌, మెక్‌డోవెల్‌ 4-1 శాతం మధ్య పుంజుకున్నాయి. 

మిడ్‌, స్మాల్‌ డౌన్‌
మార్కెట్లు పతన బాటలో ముగిసిన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.2 శాతం చొప్పున బలహీనపడ్డాయి. 1741 షేర్లు నష్టపోగా.. 748 మాత్రమే లాభాలతో నిలిచాయి.

దేశీ ఫండ్స్‌ దన్ను
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నామమాత్రంగా రూ. 17 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 209 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. గత రెండు రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 661 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు దాదాపు రూ. 1230 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే.