నష్టాల్లోనే- ప్రభుత్వ బ్యాంక్స్‌ డౌన్‌

నష్టాల్లోనే- ప్రభుత్వ బ్యాంక్స్‌ డౌన్‌

కార్పొరేట్‌ ఫలితాలు నిరాశపరచడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపుతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 116 పాయింట్లు క్షీణించి 39,100కు చేరింది. నిఫ్టీ సైతం 38 పాయింట్లు బలహీనపడి 11,649 వద్ద ట్రేడవుతోంది. చైనాతో వాణిజ్య వివాదాల ప్రభావం కార్పొరేట్‌ ఫలితాలపై పడటంతో బుధవారం వరుసగా రెండో రోజు అమెరికా స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. చైనాతో వాణిజ్య వివాద పరిష్కారాలు సుదూరంలో ఉన్నట్లు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో యూరోపియన్‌ మార్కెట్లు సైతం డీలాపడ్డాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ బలహీన ధోరణి నెలకొంది.

మెటల్‌, ఆటో వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ నీరసించగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌, ఆటో, రియల్టీ, ఫార్మా 2.2-1 శాతం మధ్య క్షీణించాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టాక్స్‌లో బీవోబీ, బీవోఐ, కెనరా, యూనియన్‌, అలహాబాద్‌, పీఎన్‌బీ, జేఅండ్‌కే, ఓబీసీ, ఎస్‌బీఐ 4-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. రియల్టీ కౌంటర్లలో డీఎల్‌ఎఫ్‌, ఇండియాబుల్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, సన్‌టెక్‌, శోభా, ఫీనిక్స్‌, ప్రెస్టేజ్‌ 3-1 శాతం మధ్య డీలాపడగా.. ఒబెరాయ్‌ 1 శాతం బలపడింది.

బ్లూచిప్స్‌ డీలా
నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 11 శాతం కుప్పకూలగా.. టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, వేదాంతా, కోల్‌ ఇండియా, టైటన్‌, మారుతీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌ 3.5-1.5 శాతం మధ్య క్షీణించాయి. అయితే విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, బ్రిటానియా, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐవోసీ, జీ, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌, యూపీఎల్‌ 3.2-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. 

మైండ్‌ట్రీ పతనం
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో మైండ్‌ట్రీ 8 శాతం పతనంకాగా.. భారత్ ఫోర్జ్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, ఆర్‌ఈసీ, టొరంట్‌ ఫార్మా, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, కజారియా 5-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా..  మరోవైపు జస్ట్‌డయల్‌, దివాన్‌ హౌసింగ్‌, డిష్‌ టీవీ, హెక్సావేర్‌, ఒరాకిల్‌, మెక్‌డోవెల్‌ 2.5-1 శాతం మధ్య పుంజుకున్నాయి. 

చిన్న షేర్లు డీలా
మార్కెట్లు నష్టాలతో కదులుతున్న నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ 1483 షేర్లు నష్టపోగా.. 681 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో తల్వాల్కర్‌ 20 శాతం కుప్పకూలగా.. మ్యాగ్మా, జీపీటీ, గ్రావిటా, టిటాగఢ్‌, సాస్కన్‌, ఎంఎం ఫోర్జింగ్స్‌, ఎల్‌జీ బ్రదర్స్‌, ఎస్‌చాంద్‌, బిర్లా మనీ, గుజరాత్‌ బోరో, కేర్‌, రుషిల్‌, 5పైసా, 8కే మైల్స్‌, మన్‌పసంద్‌ తదితరాలు 10-4.5 శాతం మధ్య పతనమయ్యాయి.