నేలచూపుతో.. యస్‌ బ్యాంక్‌ హుష్‌

నేలచూపుతో.. యస్‌ బ్యాంక్‌ హుష్‌

కార్పొరేట్‌ ఫలితాలు నిరాశపరచడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపుతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 106 పాయింట్లు క్షీణించి 39,110కు చేరింది. నిఫ్టీ సైతం 37 పాయింట్లు బలహీనపడి 11,650 వద్ద ట్రేడవుతోంది. చైనాతో వాణిజ్య వివాదాల ప్రభావం కార్పొరేట్‌ ఫలితాలపై పడటంతో బుధవారం వరుసగా రెండో రోజు అమెరికా స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. చైనాతో వాణిజ్య వివాద పరిష్కారాలు సుదూరంలో ఉన్నట్లు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో యూరోపియన్‌ మార్కెట్లు సైతం డీలాపడ్డాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ బలహీన ధోరణి నెలకొంది.

ఐటీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ నీరసించగా.. ఐటీ, ఫార్మ, ఆటో, మెటల్‌ 1-0.5 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 12 శాతం కుప్పకూలగా.. ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, వేదాంతా, హిందాల్కో, టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా, టైటన్‌, టెక్‌ మహీంద్రా, సిప్లా 2-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. అయితే విప్రో, యూపీఎల్‌, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐషర్‌ 2-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. 

మైండ్‌ట్రీ పతనం
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో మైండ్‌ట్రీ 9 శాతం పతనంకాగా.. టొరంట్‌ ఫార్మా, దివాన్‌ హౌసింగ్, రిలయన్స్‌ కేపిటల్‌, భారత్ ఫోర్జ్‌, రిలయన్స్ ఇన్‌ఫ్రా, శ్రీరామ్‌ ట్రాన్స్‌ 4-1.6 శాతం మధ్య నష్టపోయాయి. కాగా..  మరోవైపు అదానీ పవర్, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఎన్‌ఎండీసీ, టాటా పవర్, ఇండిగో 3-1 శాతం మధ్య పుంజుకున్నాయి. 

చిన్న షేర్లు డీలా
మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.35-0.15 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఇప్పటివరకూ 483 షేర్లు లాభపడగా.. 601 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో శ్రీలెదర్స్‌, రుషిల్‌, కాక్స్‌ అండ్‌కింగ్స్‌, 5పైసా, 8కే మైల్స్‌, యారోగ్రీన్, కిసాన్‌, ఫ్యూచర్‌ మార్కెట్‌, టిటాగఢ్‌ 10-4.5 శాతం మధ్య పతనమయ్యాయి.



Most Popular