యస్‌ బ్యాంక్‌ క్యూ1 ఫలితాలు

యస్‌ బ్యాంక్‌ క్యూ1 ఫలితాలు

ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో యస్‌ బ్యాంక్‌ నికర లాభం 91 శాతం క్షీణించి రూ. 114 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) మాత్రం 3 శాతం పుంజుకుని రూ. 2281 కోట్లను తాకింది. అయితే  త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.22 శాతం నుంచి 5.01 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం 1.86 శాతం నుంచి 2.91 శాతానికి పెరిగాయి. ఇక నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 3.1 శాతం నుంచి 2.8 శాతానికి బలహీనపడ్డాయి. 

షేరుపై ఎఫెక్ట్‌
ఫలితాలను యస్‌ బ్యాంకు మార్కెట్లు ముగిశాక విడుదల చేసింది. దీంతో ఫలితాల ప్రభావం యస్‌ బ్యాంకు కౌంటర్‌పై గురువారం(18న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించే అవకాశమున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. నేడు(బుధవారం) ఎన్‌ఎస్ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు ఇంట్రాడేలో రూ. 108.5 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 98 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. మంగళవారం ముగింపు రూ. 104 కాగా.. చివరికి 5.25 శాతం పతనంతో రూ. 98.40 వద్ద ముగిసింది!