విప్రో క్యూ1 ఫలితాలు

విప్రో క్యూ1 ఫలితాలు

సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు ప్రకటించడంతో ఈ ప్రభావం గురువారం(18న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించే అవకాశమున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుధవారం ఎన్‌ఎస్ఈలో విప్రో లిమిటెడ్‌ షేరు ఇంట్రాడేలో రూ. 263 సమీపంలో గరిష్టాన్ని తాకగా.. రూ. 258 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. మంగళవారం ముగింపు రూ.260 కాగా.. చివరికి అక్కడే స్థిరపడటం గమనార్హం! ఫలితాలు చూద్దాం..

ఫలితాలు ఇలా
త్రైమాసిక ప్రాతిపదికన(క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌) విప్రో ఐటీ సర్వీసుల ఆదాయం 1.6 శాతం తక్కువగా రూ. 14351 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 5.5 శాతం క్షీణించి రూ. 2652 కోట్లకు పరిమితమైంది. ఆదాయంలో బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం బిజినెస్‌ 1.5 శాతం నీరసించి రూ. 4540 కోట్లకు చేరింది. ఐటీ సర్వీసుల ఇబిట్‌ మార్జిన్లు 19.3 శాతం నుంచి 18.4 శాతానికి వెనకడుగు వేశాయి. క్యూ2(జులై-ఆగస్ట్‌)లో డాలర్ల ఆదాయం 0-0.5 శాతం మధ్య పుంజుకోవచ్చని కంపెనీ అంచనా వేసింది.