కొనుగోళ్ల దన్ను- సెన్సెక్స్ సెంచరీ

కొనుగోళ్ల దన్ను- సెన్సెక్స్ సెంచరీ

ఇటీవల అలవాటు ప్రకారం దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైనప్పటికీ తదుపరి జోరందుకున్నాయి. సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. ప్రస్తుతం 125 పాయింట్లు పుంజుకుని 39,256కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 34 పాయింట్లు బలపడి 11,697 వద్ద ట్రేడవుతోంది. వరుసగా రెండో రోజు మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు చెప్పుకోదగ్గ లాభాలతో నిలవగా.. అమెరికా స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. చైనాతో వాణిజ్య వివాద పరిష్కారాలు సుదూరంలో ఉన్నట్లు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించడంతో నాలుగు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. ఇక మరోపక్క ఆసియా మార్కెట్లలో ట్రెండ్‌ బలహీనంగా కనిపిస్తోంది.

ఆటో వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాలు 1-0.7 శాతం మధ్య పెరిగాయి. ఆటో 0.4 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, జీ, ఐబీ హౌసింగ్‌, హిందాల్కో, ఎస్‌బీఐ, బ్రిటానియా, వేదాంతా 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే యస్‌ బ్యాంక్‌, గెయిల్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఆటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యాక్సిస్‌, బీపీసీఎల్‌, ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ 3-0.65 శాతం మధ్య క్షీణించాయి. 

దివాన్‌ దూకుడు
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో దివాన్‌ హౌసింగ్‌ 13 శాతం దూసుకెళ్లగా.. రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఎంసీఎక్స్‌, రిలయన్స్ కేపిటల్‌, ఈక్విటాస్‌, పీవీఆర్, యూబీఎల్‌, ఉజ్జీవన్‌, కాల్గేట్‌ పామోలివ్‌ 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు టాటా ఎలక్సీ, ఎస్‌ఆర్‌ఎఫ్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా, కేడిలా హెల్త్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 3.5-1.5 శాతం మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు జోరందుకున్న కదులుతున్న నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లకు కొంతమేర డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.15 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ 1117 షేర్లు లాభపడగా.. 988 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఎంఈపీ 20 శాతం దూసుకెళ్లగా.. ఫిలాటెక్స్‌, ఆర్షియా, సీజీ పవర్‌, జెన్‌కాన్, టీఎఫ్‌సీఐ, సీఎంఐ, దావత్‌, బీఎఫ్‌, రామ్‌కీ, స్వెలెక్ట్‌, ప్రెసిషన్‌, మన్‌పసంద్‌, ఇగార్షీ తదితరాలు 13-5 శాతం మధ్య జంప్‌చేశాయి.