డిష్‌మన్‌- ఫెడరల్‌ బ్యాంక్‌ ప్లస్‌

డిష్‌మన్‌- ఫెడరల్‌ బ్యాంక్‌ ప్లస్‌

ఒవేరియన్‌ కేన్సర్‌ ఔషధ పరీక్షల మూడో దశలో సానుకూల ఫలితాలు వచ్చినట్లు గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ దిగ్గజం గ్లాక్సోస్మిత్‌క్లెయిన్‌(జీఎస్‌కే) పేర్కొనడంతో దేశీ హెల్త్‌కేర్‌ సంస్థ డిష్‌మన్‌ కార్బోజెన్‌ ఎమిక్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కాగా.. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించినప్పటికీ రుణాల నాణ్యత మందగించడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ ఫెడరల్‌ బ్యాంక్‌ కౌంటర్‌ అక్కడక్కడే అన్నట్లుగా కదులుతోంది. వివరాలు చూద్దాం..

డిష్‌మన్‌ కార్బోజెన్‌
ఒవేరియన్‌ కేన్సర్‌ ఔషధ పరీక్షల మూడో దశలో సానుకూల ఫలితాలు వచ్చినట్లు గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ దిగ్గజం గ్లాక్సోస్మిత్‌క్లెయిన్‌(జీఎస్‌కే) పేర్కొనడంతో దేశీ హెల్త్‌కేర్‌ సంస్థ డిష్‌మన్‌ కార్బోజెన్‌ ఎమిక్స్‌ లిమిటెడ్‌కు జోష్‌ వచ్చింది. జీఎస్‌కేకు ముడిసరుకులు అందిస్తున్న కారణంగా ఈ ఔషధం విజయవంతమైతే డిష్‌మన్‌ కార్బోజెన్‌కు ఆదాయం పెరిగే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో డిష్‌మన్‌ కార్బొజెన్‌ షేరు 3 శాతం పెరిగి రూ. 220 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 233 వరకూ ఎగసింది.

Image result for federal bank ltd

ఫెడరల్‌ బ్యాంక్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రయివేట్‌ రంగ సంస్థ ఫెడరల్‌ బ్యాంక్‌ నికర లాభం 46 శాతం ఎగసి రూ. 384 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పెరిగి రూ. 1154 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.92 శాతం నుంచి 2.99 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు సైతం 1.48 శాతం నుంచి 1.49 శాతానికి చేరాయి. క్యూ4తో పోలిస్తే క్యూ1లో స్లిప్పేజెస్‌ రూ. 256 కోట్ల నుంచి రూ. 415 కోట్లకు ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు 0.5 శాతం బలహీనపడి రూ. 106 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 108-102 మధ్య ఊగిసలాడింది.