యస్‌ బ్యాంక్‌- హెచ్‌డీఎఫ్‌సీAMC అప్‌

యస్‌ బ్యాంక్‌- హెచ్‌డీఎఫ్‌సీAMC అప్‌

ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ) సంస్థల కన్సార్షియం బ్యాంకులో పెట్టుబడులకు సిద్ధపడుతున్నట్లు వెలువడిన వార్తలు ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. కాగా.. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. 

యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్
నాలుగు పీఈ సంస్థల కన్సార్షియం 85 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5900 కోట్లు) వరకూ యస్‌ బ్యాంకులో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తిని ప్రదర్శించినట్లు మీడియా పేర్కొంది. తద్వారా బ్యాంకులో 10 శాతం వాటాను సొంతం చేసుకునే వీలున్నట్లు అభిప్రాయపడింది. ఇవి ఊహాజనిత వార్తలేనంటూ బ్యాంకు తాజాగా కొట్టిపారేసింది. అయితే సెక్యూరిటీల జారీ ద్వారా 100-120 కోట్ల డాలర్ల(రూ. 6900-8300 కోట్లు) నిధుల సమీకరణ సన్నాహాలు చేపట్టినట్లు తెలియజేసింది. కాగా.. ఈ ఏడాది తొలి క్వార్టర్‌ ఫలితాలను 17న బ్యాంకు ప్రకటించనుంది. ఈ ఫలితాల జారీ తదుపరి పీఈ సంస్థల పెట్టుబడుల అంశాన్ని బ్యాంకు ప్రకటించవచ్చని మీడియా తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో యస్‌ బ్యాంకు షేరు 14 శాతం ఎగసి రూ. 106 వద్ద ట్రేడవుతోంది. 

Image result for HDFC AMC

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ 
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రయివేట్‌ రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ నికర లాభం 42 శాతం ఎగసి రూ. 292 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 7 శాతం పెరిగి రూ. 504 కోట్లకు చేరింది. ఫీజు, కమిషన్‌ వ్యయాలు రూ. 84 కోట్ల నుంచి రూ. 11 కోట్లకు క్షీణించినట్లు కంపెనీ తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ షేరు 1 శాతం బలపడి రూ. 1950 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1988 వరకూ జంప్‌చేసింది.