లాభాల మార్కెట్లో ఈ షేర్లు జూమ్‌

లాభాల మార్కెట్లో ఈ షేర్లు జూమ్‌

మార్కెట్లు హుషారుగా కదులుతున్న నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ కౌంటర్లు లాభాలతో సందడి చేస్తున్నాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరగడం గమనించదగ్గ అంశం. జాబితాలో సద్భావ్‌ ఇంజినీరింగ్‌, బిర్లా సాఫ్ట్‌ లిమిటెడ్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌ చోటు సంపాదించాయి. ఇతర వివరాలు చూద్దాం..

సద్భావ్‌ ఇంజినీరింగ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.3 శాతం పెరిగి రూ. 181 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 196 వరకూ దూసుకెళ్లింది. గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం సగటున 13,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్‌లో 25,000 షేర్లు చేతులు మారాయి. 

బిర్లా సాఫ్ట్‌ లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.6 శాతం జంప్‌చేసి రూ. 75.50 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 78 వరకూ ఎగసింది. గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 94,800 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్‌లో 97,400 షేర్లు చేతులు మారాయి. 

ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.2 శాతం లాభపడి రూ. 280 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 288 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 26,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్‌లో 28,000 షేర్లు చేతులు మారాయి. 

టాటా మోటార్స్‌ డీవీఆర్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.5 శాతం ఎగసి  రూ. 81 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2.8 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్‌లో 2.6 లక్షల షేర్లు చేతులు మారాయి.