టాటా మెటాలిక్స్‌- అశోక్‌ లేలాండ్‌ వీక్

టాటా మెటాలిక్స్‌- అశోక్‌ లేలాండ్‌ వీక్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరును ప్రదర్శించడంతో పిగ్ ఐరన్‌ తయారీ సంస్థ టాటా మెటాలిక్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఉత్తరాఖండ్‌లోని తయారీ ప్లాంటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించడంతో ఆటో రంగ దిగ్గజం  అశోక్‌ లేలాండ్‌ లిమిటెడ్‌ కౌంటర్లోనూ అమ్మకాలు తలెత్తాయి. దీంతో లాభాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం..

టాటా మెటాలిక్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో టాటా మెటాలిక్స్‌ నికర లాభం 35 శాతంపైగా క్షీణించి రూ. 20 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 7 శాతం పెరిగి రూ. 503 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాటా మెటాలిక్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 5 శాతం పతనమై రూ. 555 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 542 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. 

Related image

అశోక్‌ లేలాండ్‌
వాహనాలకు తగినంత డిమాండ్‌ కనిపించనందున ఉత్తరాఖండ్‌లోని పంతన్‌నగర్‌ ప్లాంటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు హిందుజా గ్రూప్‌ దిగ్గజం అశోక్‌ లేలాండ్‌ తాజాగా పేర్కొంది. ఈ నెల 16 నుంచి 24 వరకూ పంత్‌నగర్‌ ప్లాంటులో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలియజేసిది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అశోక్‌ లేలాండ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం క్షీణించి రూ. 84 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 82 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.