సెన్సెక్స్‌ సెంచరీ.. ఐటీ డౌన్‌

సెన్సెక్స్‌ సెంచరీ.. ఐటీ డౌన్‌

ముందురోజు స్వల్ప ఒడిదొడుకుల మధ్య లాభాలతో ముగిసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి అటూఇటుగా ప్రారంభమయ్యాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదులుతూ  ఉన్నట్టుండి జోరందుకున్నాయి. కొనుగోళ్లు పెరగడంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. 114 పాయింట్లు బలపడి 39,011కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 30 పాయింట్లు పుంజుకుని 11,618 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,012- 38,845 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ 11619- 11574 పాయింట్ల మధ్య ఒడిదొడుకులు ఎదుర్కొంది. కాగా.. సోమవారం వరుసగా నాలుగో రోజు అమెరికా స్టాక్‌ ఇండెక్సులు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. 

మెటల్‌, బ్యాంక్స్‌ ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, బ్యాంక్స్‌, రియల్టీ 0.8-0.4 శాతం మధ్య బలపడగా.. ఐటీ 0.7 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, వేదాంతా, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, సిప్లా 2-1 శాతం మధ్య ఎగశాయి. అయితే టీసీఎస్‌, ఐబీ హౌసింగ్‌, విప్రో, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఆటో, యూపీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, హీరో మోటో, ఇండస్‌ఇండ్‌ 1.4-0.5 శాతం మధ్య క్షీణించాయి. 

దివాన్‌ అప్‌
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో దివాన్‌, ఎస్‌ఆర్ఎఫ్‌, బిర్లా సాఫ్ట్‌, ఆర్‌ఈసీ, ఎంసీఎక్స్‌, మణప్పురం, టొరంట్‌ ఫార్మా, స్టార్‌, ఎన్‌బీసీసీ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, పిరమల్‌, జస్ట్‌ డయల్‌, అమరరాజా, అశోక్‌ లేలాండ్‌, టీవీఎస్‌ మోటార్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, కమిన్స్‌ 3-1.4 శాతం మధ్య నష్టపోయాయి. 

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో ప్రారంభమై ఊపందుకున్న నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లకు కొంతమేర డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.12 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ 766 షేర్లు లాభపడగా.. 700 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఉత్తమ్‌, ఎస్‌పీఎంఎల్, సద్భావ్‌, ఈస్టర్‌, అక్షర్‌ కెమ్‌, పీజీ, జయభారత్‌, ఫ్యూచర్‌ సప్లై, షాయిలీ, అవధ్‌, 8కే మైల్స్‌ తదితరాలు 11-4 శాతం మధ్య జంప్‌చేశాయి.