స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (జూలై 16)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (జూలై 16)
 • బోనస్‌ షేర్ల జారీకి అనుమతినిచ్చిన బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డు
 • డిమాండ్‌ తగ్గడంతో ఇవాళ్టి నుంచి ఈనెల 24 వరకు ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌ ప్లాంట్‌ను మూసివేయనున్నట్టు ప్రకటించిన అశోక్‌లేలాండ్‌
 • సెప్టెంబర్‌ 27 నుంచి ఎఫ్‌అండ్‌ఓ నుంచి డీహెచ్‌ఎఫ్‌ఎల్ తొలగింపు‌, కేవలం ఈక్విటీ సెగ్మెంట్‌లోనే ట్రేడింగ్‌
 • పేజ్‌ ఇండస్ట్రీస్‌లో వాటాను 5.01 శాతం నుంచి 2.98 శాతానికి తగ్గించుకున్న కార్తీక క్యాపిటల్‌
 • రూ.330 కోట్ల విలువైన డిబెంచర్లను బైబ్యాక్‌ చేయనున్న అదాని పవర్‌ ముంద్రా
 • ప్రత్యేక డివిడెండ్‌ చెల్లింపుపై ఈనెల 20న జరిగే బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకోనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
 • రూ.5వేల కోట్ల ఎన్‌సీడీలను జారీ చేయనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
 • ఫినెస్‌ ఇంటర్నేషనల్‌ డిజైన్‌లో రూ.60 కోట్లకు 51 శాతం వాటాను కొనుగోలు చేసిన ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌
 • యాంపెర్‌ వెహికిల్స్‌లో వాటాను 81.23 శాతానికి పెంచుకున్న గ్రీవ్స్‌ కాటన్‌
 • క్యూ-1లో 35.5శాతం క్షీణతతో రూ.19.6 కోట్లుగా నమోదైన టాటా మెటాలిక్స్‌ నికరలాభం
 • క్యూ-1లో 7.9శాతం వృద్ధితో రూ.120.3 కోట్లకు చేరిన ఆటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ మొత్తం ఆదాయం
 • జీటీపీఎల్‌ హాత్‌వే సర్క్యూట్‌ ఫిల్టర్‌ 10శాతానికి సవరింపు
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి జీటీపీఎల్‌ హాత్‌వే, సుప్రీమ్‌ ఇన్‌ఫ్రా

Today's Results..

 • HDFC అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, 
 • TV18 బ్రాడ్‌కాస్ట్‌, 
 • నెట్‌వర్క్‌ 18 మీడియా, 
 • నెస్ట్‌ మీడియావర్క్స్‌, 
 • ఫెడరల్‌ బ్యాంక్‌, 
 • అగ్రో టెక్‌ ఫుడ్స్‌, 
 • డీసీబీ బ్యాంక్‌, 
 • 5పైసా క్యాపిటల్‌, 
 • జై భారత్‌ మారుతి, 
 • వికాస్‌ మల్టీకార్ప్‌