12 నెలల నుండి FPIs వరుసగా కొంటున్న స్టాక్స్ ఇవే..!

12 నెలల నుండి FPIs వరుసగా కొంటున్న స్టాక్స్ ఇవే..!

విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) దేశీయ మార్కెట్లలో వరుసగా కొన్ని స్టాక్స్ మీద పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. గత 4 త్రైమాసికాలుగా వీరు కొన్ని స్టాక్స్ మీద పెట్టుబడులు పెంచుతూ వస్తున్నారు. అమెరికా చైనా వాణిజ్య పోరు, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్ఛితి వంటి అంశాల కారణంగా ఫారిన్ ఇన్వెస్టర్లు గత సంవత్సరం నుండి రూ. 52,000 కోట్ల పెట్టుబడులను అదనంగా దేశీయ మార్కెట్లలోకి ప్రవహింపజేశారు. వీరు పెట్టుబడులను పెట్టిన స్టాక్స్‌లో ONGC, కోల్ ఇండియా, SBI లైఫ్ ఇన్స్యూరెన్స్, ముత్తూట్ ఫిన్, కర్ణాటక బ్యాంక్ వంటి స్టాక్స్ కూడా ఉన్నాయి. ఫండమెంటల్స్ బాగా ఉండి, బ్రోకరేజ్ సంస్థల పాజిటివ్ దృష్టి ఉన్న కంపెనీల్లోనే వీరు పెట్టుబడులను పెంచుతూ వస్తున్నారు. వీటిలో గత సంవత్సర కాలం నుండి చూస్తే.. ఎస్బీఐలో 19.4శాతం వరకూ స్టాక్స్ ను పెంచుతూ పోయారు. బ్రోకరేజ్ సంస్థల అంచనాల ప్రకారం ఇన్స్యూరెన్స్ రంగంలో రాబోయే మూడేళ్ళ కాలంలో మంచి లాభదాయకత ఉందని పేర్కొంటున్నాయి. దీంతో FPIs ఇన్స్యూరెన్స్ రంగంలో పెట్టుబడులను పెంచారు. మార్చ్ నెల ముగిసే సరికి కోల్ ఇండియాలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి 7.1 శాతం ఉండగా, అది జూన్ త్రైమాసికానికి 9 శాతానికి పెరిగింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే..కోల్ ఇండియా 149 శాతం వృద్ధిని కనబరిచింది. ప్రైవైట్ సెక్టార్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ లో కూడా ఫారిన్ ఇన్వెస్టర్లు 13.9 శాతానికి పెట్టుబడులను పెంచారు. గత క్వార్టర్లో ఇది 12.3 గా ఉంది. గోల్డ్ లోన్ కంపెనీల గ్రోత్ ప్రస్తుతం తక్కువగానే ఉన్నా.. లోన్ అసెట్స్ విషయంలో గోల్డ్ రేట్లు పెరిగితే.. ఈ కంపెనీలు తిరిగి అధిక లాభాలను అందిస్తాయన్నది FPIs ల నమ్మకం. 
ఇక ONGC విషయానికి వస్తే.. ఇప్పటికే పలు ప్రముఖ రేటింగ్ సంస్థలు ఈ కంపెనీకి బై రేటింగ్స్ ను ఇచ్చాయి. మరికొన్ని సంస్థలు అవుట్ పెర్ఫార్మ్ రేటింగ్స్ ను కూడా ఇచ్చాయి. గత సంవత్సరం FPIs లు ఇందులో 5.4శాతం పెట్టుబడులను పెట్టగా, ఈ సంవత్సరం జూన్ నాటికి  7.6శాతం పెంచారు. 
కర్ణాటక బ్యాంక్, గ్రాన్యూల్స్ ఇండియా, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్&కెమికల్స్ (GSFC) , TCNS క్లోతింగ్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, ఆర్తి ఇండస్ట్రీస్ వంటి వాటిలో ఫారిన్ ఇన్వెస్టర్లు 5 శాతానికి పైగా పెట్టుబడులను పెంచారు. వీటిలో కర్ణాటక బ్యాంక్‌ షేర్‌కు సెంట్రమ్ బ్రోకింగ్ సంస్థ ' బయ్ " రేటింగ్స్ ను ఇచ్చింది. ఎండ్యూరెన్స్ స్టాక్స్ మీద యాక్సిస్ క్యాపిటల్ అవుట్ పెర్ఫార్మ్ రేటింగ్స్ ను ఇచ్చింది. ఇక TCNS క్లోతింగ్ షేర్ మీద ఎక్విరస్ బ్రోకింగ్ సంస్థ ' add' రేటింగ్స్ ను ఇచ్చింది. 

 

 

Disclaimer: పైన పేర్కొన్న సలహాలు , సూచనలు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, ఎనలిస్టులచే ఇవ్వబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి.