డీ మార్ట్ కళకళ..! అలహాబాద్ బ్యాంక్ విల విల !

డీ మార్ట్ కళకళ..! అలహాబాద్ బ్యాంక్ విల విల !

డీ మార్ట్ ( అవెన్యూ సూపర్ మార్ట్స్ ) స్టాక్ సోమవారం ఇంట్రాడేలో దాదాపు 6 శాతం ర్యాలీ చేసింది. అవెన్యూ సూపర్ మార్ట్ తన జూన్ త్రైమాసిక ఫలితాలను మెరుగ్గా వెల్లడించడంతో ఈ స్టాక్స్ వేగంగా పుంజుకున్నాయి. డబుల్ డిజిట్ గ్రోత్‌ను ప్రకటించడం, కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ 31.87శాతం పెరిగి రూ. 323.09 కోట్లుగా నమోదు చేయడంతో ఈ స్టాక్స్ అప్ ట్రెండ్‌లో నమోదు అవుతున్నాయి. మొత్తం ఆదాయం 27 శాతం పెరిగి రూ. 5,814.6 కోట్లుగా డీ మార్ట్ వెల్లడించింది. ఎబిటా మార్జిన్లు 41శాతం పెరిగి (YoY ) రూ. 596.8 కోట్లుగా ఈ జూన్ క్వార్టర్‌ నాటికి ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో గ్లోబల్ రేటింగ్ సంస్థలు  అవెన్యూ సూపర్ మార్ట్ కు రేటింగ్స్ ను పెంచేశాయి. క్రెడిట్ సూసీ గతంలో ఈ స్టాక్ కు అండర్ పెర్ఫార్మ్ రేటింగ్‌ను ఇవ్వగా , తాజాగా ఈ రేటింగ్ ను సవరించి నేచురల్ రేటింగ్ ను ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ రూ. 1,330 గా పెంచింది. 
అలహాబాద్ బ్యాంక్ విలవిల :
నేటి సోమవారం నాటి మార్కెట్లలో అలహాబాద్ బ్యాంక్ దాదాపు 15 శాతం నష్టపోయింది. బ్యాంకులో సుమారు రూ. 1,774 కోట్ల మోసం జరిగిందని, భూషన్ పవర్ అండ్ స్టీల్ కంపెనీకి ఇచ్చిన రుణాలు ఎగవేతకు గురయ్యాయని ఆర్బీఐకు సమర్పించిన నివేదికలో వెల్లడించడంతో ఈ బ్యాంక్ స్టాక్స్ తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యాయి. సోమవారం ఇంట్రాడేలో ఈ స్టాక్ 11 శాతం నష్టపోయి ఈ స్టాక్  రూ. 42.30 వద్ద ట్రేడ్ అవుతోంది. పబ్లిక్ సెక్టార్‌ కు చెందిన ఈ PSU బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో  బ్యాంక్ స్కాం బయట పడటంతో సీబీఐకు ఫిర్యాదు చేసింది. భూషణ్ పవర్  వేయి కోట్ల రుణాన్ని దుర్వినియోగం చేసిందని ఆడిటింగ్ లో బయట పడింది. ఈ విషయాన్ని ఆర్బీఐకి ఫిర్యాదు చేసింది అలహాబాద్ బ్యాంక్. భూషణ్ పవర్ తీసుకున్న రుణాలు  మిస్‌ యూజ్ అయ్యాయని , చెల్లింపులను ఎగవేసినట్టు గుర్తించామని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ స్టాక్ ఒక్కసారిగా కుప్పకూలింది. గత వారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రూ. 3,805 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్  జరిగిందని ఆర్బీఐకి వెల్లడించింది. ఈ బ్యాంక్ కూడా భూషణ్‌ పవర్ అండ్ స్టీల్ కంపెనీకి ఇచ్చిన రుణమే అది. BPSL తీసుకున్న రుణం దుర్వినియోగం జరిగిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేర్కొనడంతో  PNB స్టాక్ కూడా 0.66శాతం డౌన్ అయ్యింది.