ఆరంభ లాభాలు ఆవిరి! మిశ్రమంగా ట్రేడ్ అవుతున్న మార్కెట్లు!

ఆరంభ లాభాలు ఆవిరి! మిశ్రమంగా ట్రేడ్ అవుతున్న మార్కెట్లు!

సోమవారం ఉదయం ధీమాగా ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం కల్లా డీలా పడ్డాయి. ICICI బ్యాంక్, ITC లిమిటెడ్, DHFL వంటి స్టాక్స్ భారీగా నష్టపోవడంతో మదుపర్లు నిరాశకు గురయ్యారు. సెన్సెక్స్ 38786 వద్ద, నిఫ్టీ 11554 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మిశ్రమంగా స్పందిస్తున్న మార్కెట్లలో బ్యాంక్ నిఫ్టీ దాదాపు 188 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 500 ఇండెక్స్ కూడా 0.24 శాతం నష్టంతో ట్రేడ్ అవుతోంది.  ఇక ఈ రోజు మాగ్జిమమ్ లూజర్ అయిన DHFL దాదాపు 30శాతం నష్టపోయింది. సోమవారం నాటి మధ్యాహ్నం వరకూ దేశీయ మార్కెట్లలో టాప్ గెయినర్స్ గా ఇన్ఫోసిస్, యెస్ బ్యాంక్, సన్ ఫార్మా, బజాజ్  ఫైనాన్స్, గ్రాసిమ్ స్టాక్స్  నిలిచాయి. అలాగే టాప్ లూజర్స్ గా ఇండియా బుల్స్, వేదాంత, జీ ఎంటర్‌టైన్మెంట్ , టైటాన్ కంపెనీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, DHFL ఉన్నాయి.