అయ్యో..! ఫ్యూచర్స్ గ్రూప్ ఫ్యూచర్ ఎంటి? 

అయ్యో..! ఫ్యూచర్స్ గ్రూప్ ఫ్యూచర్ ఎంటి? 

ఫ్యూచర్స్ గ్రూప్ సంస్థ అధినేత , చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయిన దినేష్ మహేశ్వరిని  డైరెక్టరేట్ ఆఫ్‌ రెవిన్యూ ఇంటిలిజెన్స్ అరెస్ట్ చేయడంతో ఆ కంపెనీ స్టాక్స్ సోమవారం నాటి మార్కెట్లలో దాదాపు 11 శాతం నష్టపోయాయి. రూ. 14.58 కోట్ల కస్టమ్స్ డ్యూటీని ఎగవేసినట్టు, ఫ్యూచర్స్ గ్రూప్  పలు ఉత్పత్తులను విదేశాల నుండి బంగ్లాదేశ్‌కు తరలించి అక్కడి నుండి భారత దేశానికి ఫ్రీ ట్రేడ్ నిబంధనలను అడ్డుపెట్టుకుని కోట్ల మేరకు కస్టమ్స్ డ్యూటీని ఎగవేశారని రెవిన్యూ ఇంటిలిజెన్స్ ఆరోపించింది.  కాగా కంపెనీ వైస్ ఛైర్మన్ కిషోర్ బియానీ, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ బియానీలపై కూడా పలు ఎలిగేషన్స్ ఉన్నాయని వార్తలు రావడంతో ఫ్యూచర్స్ ఎంటర్ ప్రైజెస్ షేర్లు డీలా పడ్డాయి. 20 డేస్ యావరేజ్‌ న 18 సార్లు ట్రేడింగ్ వాల్యూమ్స్ నమోదైన ఈ స్టాక్స్ 9 నెలల కనిష్టానికి దిగువగా 16 శాతం నష్టపోయాయి.