Q-1 రిజల్ట్ ఎఫెక్ట్ ...హాత్ వే డౌన్ ! కర్ణాటక బ్యాంక్ అప్ !

Q-1 రిజల్ట్ ఎఫెక్ట్ ...హాత్ వే డౌన్ ! కర్ణాటక బ్యాంక్ అప్ !

ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల వెల్లడి,అంచనాలతో పలు కంపెనీల షేర్లు ఉత్థాన పతనాలను చవి చూస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా హాత్ వే కేబుల్స్ సంస్థ తన జూన్ తొలి క్వార్టర్ ఫలితాల తరువాత ఆ స్టాక్ 5.5 శాతం నష్టపోయి రూ. 23.10 వద్ద ట్రేడ్ అవుతోంది. కంపెనీ తన త్రైమాసిక ఫలితాల్లో రెవిన్యూ 17 శాతం వృద్ధితో రూ. 450 కోట్లుగా, నెట్ లాస్ రూ. 10 కోట్లుగా ప్రకటించింది. ఇతర ఆదాయాల కింద రూ. 57 కోట్లను చూపించినా.. గత సంవత్సరం ఫలితాలను బేరీజు వేసుకున్న మదుపర్లు హాత్ వే  కేబుల్ కౌంటర్లలో అమ్మకాలు కొనసాగించారు. దీంతో ఈ షేర్ భారీగా నష్టపోయింది. 
కర్ణాటక బ్యాంక్ 
ఇక కర్ణాటక బ్యాంక్ జూన్ క్వార్టర్ ఫలితాలు మెరుగ్గా ఉండటంతో ఈ స్టాక్ దూసుకెళ్తుంది. కర్ణాటక బ్యాంక్ షేర్  3.2శాతం వృద్ధితో రూ. 104.80 వద్ద ట్రేడ్ అవుతోంది. తన తొలి త్రైమాసిక ఫలితాల్లో బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ ఆదాయం 5 శాతం పెరిగి రూ. 494 కోట్లుగా చూపింది. నెట్ ప్రాఫిట్ 7శాతం పెరిగి రూ. 175 కోట్లుగానూ, GNPA 4.55 శాతం, NPA 3.33 శాతంగానూ ఉన్నట్టు పేర్కొంది. ఈ కౌంటర్లో భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.