BEML కంపెనీకి పెరగనున్న వర్క్ ఆర్డర్లు..!

BEML కంపెనీకి పెరగనున్న వర్క్ ఆర్డర్లు..!

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) కంపెనీ ఆర్డర్ బుక్ FY 20 లో సుమారు రూ. 12,000 - రూ.13,000 కోట్లకు పెరగనుందని కంపెనీ ఎండీ DK. హోతా పేర్కొన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో దాదాపు 87 శాతం వర్క్ ఆర్డర్లను కంప్లీట్ చేసిన BEML , రూ. 9000 కోట్ల వర్క్ ఆర్డర్లను కలిగి ఉంది. రానున్న 5 ఏళ్ళలో మరో రూ. 8000 కోట్ల వర్క్ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని, ఢిఫెన్స్ రంగం నుండి మరో 1500 కోట్ల వర్క్ ఆర్డర్లు రానున్నాయని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల నిర్వాహణ వ్యయం గతంలో 30 శాతం ఉండగా, ప్రస్తుతం అది 22శాతానికి పరిమితమైందని BEML పేర్కొంది. కంపెనీ లాభాల్లో ఉండటంతో BEML లో ఉన్న ప్రభుత్వ వాటాలను విక్రయించే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. పలు దిగ్గజ కంపెనీలు , ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు మార్కెట్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి గానూ BEML సుమారు రూ. 4,200 కోట్ల టర్నోవర్ ను సాధించనున్నట్టు సమాచారం.