ఇన్ఫోసిస్ :
ట్రిఫాక్టా ఇంక్‌లో $6 మిలియన్లను ఇన్వెస్ట్ చేయనున్న ఇన్ఫోసిస్ కంపెనీ రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అంశాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ప్రకటించింది. ట్రిఫాక్టా కంపెనీలో పెట్టుబడులు లాభసాటిగా ఉండనున్నట్టు.. పలు ప్రాజెక్టులపై సంయుక్త భాగస్వామ్యం జరపనున్నట్టు ఇన్ఫోసిస్ పేర్కొంది.
సిండికేట్ బ్యాంక్;
అన్ని రకాల రుణాలపై MCLR రేట్లను 5 బేసిస్ పాయింట్లను సిండికేట్ బ్యాంక్ తగ్గించింది. నేటి నుంచిఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్టు బ్యాంక్ ప్రకటించింది.
ఇండిగో :
ప్రైవేట్ విమాన యాన సంస్థ ఇండిగో కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. వివాదాలు ఇండిగో చుట్టూ మరింత బిగుస్తున్నాయి. తాజాగా ఇండిగో బోర్డు సభ్యులతో పాటు పలువురు ఉన్నతాధికారులకు సెబీ సమన్లను జారీ చేసింది. ఇద్దరు ప్రమోటర్ల మధ్య ఆధిపత్య పోరు కంపెనీ పరువు ప్రతిష్టలను మరింత మంటగలుపుతున్నాయని సంస్థ ఉద్యోగులు భావిస్తున్నారు.
BHEL
వైజాగ్ ప్లాంట్‌లో ఎస్పీవీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు NTPC నుంచి రూ.100 కోట్ల కాంట్రాక్టును దక్కించుకున్న బీహెచ్ఈఎల్.
దేవాన్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL )
తొలి త్రైమాసికంలో డీహెచ్ఎఫ్ఎల్ నష్టాలు భారీగా పెరిగాయి. , రూ.134 కోట్ల నుంచి రూ.2223 కోట్లకు నికర నష్టం పెరిగింది. ఎన్‌సీడీలపై రూ.48 కోట్ల వడ్డీ చెల్లింపులో డీహెచ్ఎఫ్ఎల్ విఫలమైంది. నేటి సోమవారం నాటి మార్కెట్ల ఆరంభంలోనే ఈ స్టాక్ దాదాపు 10శాతానికి పైగా నష్టపోయింది.
ఇన్ఫోసిస్ అప్ .. DHFL డౌన్ !
