వరల్డ్ బ్యాంక్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అన్షులా కాంత్ ...!

వరల్డ్ బ్యాంక్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అన్షులా కాంత్ ...!

ప్రపంచ బ్యాంక్ CFO (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అన్షులా కాంత్‌ను నియమించినట్టు వరల్డ్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. అన్షులా గతంలో ఎస్బీఐ CFO గా కూడా పనిచేసి ప్రస్తుతం ఎండీగా కొనసాగుతున్నారు. ఫైనాన్స్ , బ్యాంకింగ్, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా వాడుకోడంలో అన్షులాకు 35 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ CFO గా అన్షులా కాంత్ అంతర్జాతీయ అభివృద్ధి సంఘంతో కూడా కలిసి పనిచేయనుంది. రిస్క్, ట్రెజరీ, ఫండింగ్, రెగ్యులేటరీ సమ్మతి మరియు కార్యకలాపాలతో సహా విభిన్న నాయకత్వ సవాళ్ళలో ఆమె రాణించిందని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు మాల్పాస్ ప్రశంసిస్తున్నారు.