పాజిటివ్ ఓపెనింగ్...! ఇన్ఫోసిస్ అప్

పాజిటివ్ ఓపెనింగ్...! ఇన్ఫోసిస్ అప్

నేటి సోమవారం నాటి మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సంకేతాలు, వివిధ కంపెనీల క్యూ-1 రిజల్ట్స్ , ఈ వారం రానున్న IIP,ద్రవ్యోల్బణ డేటాలు వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. ఇక రిలయన్స్, L&T , HDFC బ్యాంక్, విప్రో, డాబర్ వంటి కంపెనీలు ఈ వారంలోనే తమ జూన్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. 12 శాతానికి తగ్గిన వర్షపాత రేటు కూడా మార్కెట్లకు కలిసొచ్చే అంశంగా మారింది. క్రూడ్‌ ఆయిల్ ధరలు, రూపీ మారకపు విలువ నేటి మార్కెట్లకు కీలకం కానుంది. అంతర్జాతీయంగా చూస్తే.. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. 

ఇన్ఫోసిస్ అప్ ..!
నేటి సోమవారం నాటి మార్కెట్లు సానుకూలంగా ఆరంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ హైయ్యర్‌ ట్రేడింగ్‌తో ప్రారంభమయ్యాయి. ఇన్ఫోసిస్ తొలి త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా రావడం మార్కెట్లకు సపోర్ట్ గా మారింది. S&P BSE సెన్సెక్స్ 0.74 శాతం వృద్ధితో 39,023.97 వద్ద, నిఫ్టీ 0.57శాతం వృద్ధితో 11,618.40 పాయింట్లతో ఆరంభమయ్యాయి.  NSE నిఫ్టీ ఇండెక్స్ 0.48శాతం పెరిగింది. NSE లోని 790 స్టాక్స్ అప్‌ ట్రెండ్‌లోనూ, 552 స్టాక్స్ డౌన్‌ ట్రెండ్‌లోనూ కనబడుతున్నాయి. ఇన్ఫోసిస్ స్టాక్స్ 5.8 శాతం పెరిగి రూ. 768.70 వద్ద ట్రేడ్ అవుతోంది.