మార్కెట్లో కరెక్షన్లు..! అయినా.. ఈ 10 స్టాక్స్ భేష్ అంటున్న ఎనలిస్టులు!

మార్కెట్లో కరెక్షన్లు..! అయినా.. ఈ 10 స్టాక్స్ భేష్ అంటున్న ఎనలిస్టులు!

2020 ఆర్ధిక సంవత్సరం (FY20) ఆరంభంలోనే ముదపర్ల సంపద ఆవిరవ్వడం మనం చూశాం. బడ్జెట్ ప్రభావం, గ్లోబల్ మార్కెట్ల అస్థిరత, క్రూడ్ ఆయిల్ ధరలు, గోల్డ్ పై ట్యాక్స్ వంటి అంశాలు , ట్రంప్ దుందుడుకు చర్యలు వంటివి దేశీయ మార్కెట్లను అస్థిర పరుస్తున్నాయని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. మరి ఈ పరిస్థితిలో ఇన్వెస్టర్లు ఎటు వైపు మొగ్గు చూపాలి. ఏ స్టాక్స్  లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోసం కొనచ్చు అన్నదానిపై బ్రోకింగ్ సంస్థలు, మార్కెట్ విశ్లేషకులు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటో సెక్టార్, మెటల్స్, అగ్రి, ఆయిల్ అండ్ గ్యాస్ , హౌజింగ్ ఫైనాన్స్ రంగాలు డౌన్ ఫాల్‌లో ఉన్నాయనే చెప్పొచ్చు. 
గత మార్చ్ త్రైమాసికం కన్నా  జూన్ త్రైమాసికంలో కాస్త మెరుగైన ఫలితాలు రావొచ్చని కొందరు బుల్లిష్ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. 2020 ఆర్ధిక సంవత్సరం కన్నా 2021 ఆర్ధిక సంవత్సరం నాటికి మార్కెట్లలో గ్రోత్ కనబడొచ్చన్నది వీరి భావన. FY20 ఎర్నింగ్స్, మరియు FY 21 ఎర్నింగ్స్ మీద మార్కెట్లు చాలా ఆశలు పెట్టుకున్నాయి. దీర్ఘకాలిక ప్రభుత్వ ఆర్ధిక క్రమశిక్షణ, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరిగితే కనుక విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చు. దీనివల్ల పరిశ్రమలకు, నిర్మాణ సామాగ్రి సంస్థలకు సానుకూలంగా మారే అవకాశం ఉందని షేర్ ఖాన్ బ్రోకింగ్ సంస్థ భావిస్తుంది. ఇటీవల మార్కెట్లలోని కరెక్షన్ల తరువాత సెన్సెక్స్ FY21 ఆర్ధిక సంవత్సర ఆదాయాలు 16-16.5 రెట్లు ట్రేడ్ అవుతున్నాయి.  దీర్ఘకాలిక ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఇది కలిసొచ్చే అంశంగా షేర్ ఖాన్ పేర్కొంటుంది. 
ఈ నేపథ్యంలో జూన్ త్రైమాసికం ముగిసే నాటికి కొన్ని స్టాక్స్ మంచి లాభసాటి ఆదాయాలను ఆర్జించవచ్చని కొన్ని బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అవేంటో చూద్దాం.

మోతీలాల్ ఓశ్వాల్ అంచనాలు:
1. ABB :  నెట్ ప్రాఫిట్ అంచనాలు =102శాతం (YoY) వార్షిక ప్రాతిపదికన వృద్ధి .
2. JK సిమెంట్ ; నెట్ ప్రాఫిట్ అంచనాలు =148శాతం (YoY) వార్షిక ప్రాతిపదికన వృద్ధి.
3. బయోకాన్ : నెట్ ప్రాఫిట్ అంచనాలు =183శాతం (YoY) వార్షిక ప్రాతిపదికన వృద్ధి.
4. ఆదిత్య బిర్లా ఫ్యాషన్: నెట్ ప్రాఫిట్ అంచనాలు =1609 శాతం (YoY) వార్షిక ప్రాతిపదికన వృద్ధి.
5. ఈక్విటాస్ హోల్డింగ్స్ : నెట్ ప్రాఫిట్ అంచనాలు =106శాతం (YoY) వార్షిక ప్రాతిపదికన వృద్ధి.


కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనాలు: 
6. యాక్సిస్ బ్యాంక్: PAT (ప్రాపిట్ ఆఫ్టర్ ట్యాక్ ) అంచనాలు= 141 శాతం (YoY) వార్షిక ప్రాతిపదికన వృద్ధి.
7. దాల్మియా భారత్ : నెట్ ప్రాఫిట్ అంచనాలు =309 శాతం (YoY) వార్షిక ప్రాతిపదికన వృద్ధి.
8. ఇండియా సిమెంట్ : నెట్ ప్రాఫిట్ అంచనాలు =253 శాతం (YoY) వార్షిక ప్రాతిపదికన వృద్ధి.
9. అపోలో హాస్పిటల్స్ : నెట్ ప్రాఫిట్ అంచనాలు =170 శాతం (YoY) వార్షిక ప్రాతిపదికన వృద్ధి.
10. HCG : నెట్ ప్రాఫిట్ అంచనాలు =104శాతం (YoY) వార్షిక ప్రాతిపదికన వృద్ధి.
....................

Disclaimer: పైన పేర్కొన్న సలహాలు, సూచనలు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, ఎనలిస్టులచే ఇవ్వబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి.