ట్రిపుల్‌ సెంచరీ- లాభాలతో ఖుషీ

ట్రిపుల్‌ సెంచరీ- లాభాలతో ఖుషీ

వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ ప్రోత్సాహకరంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌ సెషన్‌కల్లా మరింత జోరందుకున్నాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ పావెల్‌ వడ్డీ తగ్గింపు సంకేతాలు ఇవ్వడంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడగా.. ఆసియాలోనూ సానుకూల ట్రెండ్‌ కనిపించింది. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. అన్ని రంగాలలోనూ కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్‌ తదుపరి డబుల్‌, ట్రిపుల్‌ సెంచరీలు సాధించింది. ఇంట్రాడేలో 38,892 వరకూ పెరిగింది. చివరికి 266 పాయింట్లు జంప్‌చేసి 38,823 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 84 పాయింట్లు ఎగసి 11,583 వద్ద స్థిరపడింది. కాగా.. కేంద్ర బడ్జెట్‌ తదుపరి నాలుగు రోజులుగా దేశీ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలుస్తున్న విషయం విదితమే.

మీడియా, మెటల్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మీడియా, ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ, ఫార్మా 4-1.25 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హీరో మోటో, ఇండస్‌ఇండ్‌, టాటా మోటార్స్, హిందాల్కో, వేదాంతా, ఎస్‌బీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం 5-2 శాతం మధ్య పురోగమించాయి. అయితే టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, ఐవోసీ, యూపీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.4-0.5 శాతం మధ్య నీరసించాయి. 

రిలయన్స్ ఇన్‌ఫ్రా జూమ్
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రా, అరవింద్‌, భారత్ ఫోర్జ్‌, డీఎల్‌ఎఫ్‌, ఒరాకిల్‌, పేజ్‌ 11-4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఇండిగో, బిర్లా సాఫ్ట్‌, బీహెచ్‌ఈఎల్‌, ఎన్‌ఎండీసీ, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, ఎన్‌సీసీ, బాటా ఇండియా, రామ్‌కో సిమెంట్‌, హావెల్స్‌ 3.3-1.2 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. మీడియా కౌంటర్లలో డిష్‌ టీవీ 16 శాతం, డెన్‌ నెట్‌వర్క్స్‌ 12 శాతం చొప్పున దూసుకెళ్లగా, జీ, హాథవే, జీ మీడియా, టీవీ 18, పీవీఆర్‌, సన్‌ టీవీ 7.5-1.5 శాతం మధ్య పెరిగాయి.ఐబీ హౌసింగ్‌,  అల్ట్రాటెక్‌, గెయిల్‌, సిప్లా 4-1.5 శాతం మధ్య ఎగశాయి. 

చిన్న షేర్లు అప్‌
మార్కెట్లు హుషారుగా ముగిసిన నేపథ్యంలో చిన్న, మధ్యతరహా షేర్లలో సానుకూల ట్రెండ్‌ నమోదైంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్‌ 0.6-0.4 శాతం చొప్పున బలపడ్దాయి. 1250 షేర్లు లాభపడగా.. 1195 నష్టాలతో నిలిచాయి.

డీఐఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 605 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 667 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 674 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 711 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');