మార్కెట్ల పనిగంటలను పెంచనున్న ఆర్బీఐ! ఇన్వెస్టర్లకు లాభమా..? నష్టమా?

మార్కెట్ల పనిగంటలను పెంచనున్న ఆర్బీఐ! ఇన్వెస్టర్లకు లాభమా..? నష్టమా?

కరెన్సీ మార్కెట్ల పనితీరు, సమయం వంటి విషయాల్లో ఆర్బీఐ అంతర్గత కమిటీ సమీక్షను నిర్వహించింది. ఈ సమీక్ష ఫలితాలను బట్టి మార్కెట్ల పని గంటలను ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 9.00 గంటల వరకూ పొడిగించవచ్చని తీర్మానించింది. సాధారణంగా ప్రస్తుతం మార్కెట్లు ఉదయం ప్రారంభమై సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తున్నాయి. కరెన్సీ మార్కెట్ వర్కింగ్ అవర్స్ పెంచడం వల్ల సాధారణ ఇన్వెస్టర్లు, మరియు ట్రేడర్లకు లాభసాటిగా ఉంటుందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఇలా సమయం పెంచడం వల్ల పోస్ట్ మార్కెట్ సమాచారం, డేటా వివరాలు, ఆన్ షోర్ ధరల ఆవిష్కరణ, ఆఫ్‌షోర్ వాల్యూమ్స్ ను ఆన్‌ షోర్‌కు మార్చడం వంటి ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నప్పటికీ... ఇది వాటాదారులకు అధిక వ్యయాలను కలిగించవచ్చేమోనని ఆర్బీఐ ముసాయిదా కమిటీ అభిప్రాయపడింది. అయితే.. కాల్ మార్కెట్ల సమయాన్ని సాయంత్రం 6.00 గంటల వరకూ పొడిగించుకోవచ్చని, రియల్ టైం గ్రాస్ సెటిల్ మెంట్ (RTGS)  సిస్టమ్‌ను యథావిధిగా కొనసాగించవచ్చని ఆర్బీఐ అభిప్రాయ పడింది. ఇక బాండ్ మార్కెట్ ట్రేడింగ్ లో పాల్గొనే వారు సాయంత్రం 5.00 తరువాత కూడా పొడిగించమని కోరలేదు కాబట్టి బాండ్ మార్కెట్ల సమయం యథాతథంగా ఉండొచ్చని ఆర్బీఐ అంతర్గత కమిటీ సూచించింది. అలాగే జీ-సెకన్ ట్రేడింగ్ కోసం మార్కెట్ పని గంటలను పెంచాలని ఎవరి నుండి అభ్యర్ధనలు రాలేదని ఆర్బీఐ కమిటీ వెల్లడించింది. సమయం పొడగించడం వల్ల లాభం ఉంటుందా అన్న ప్రశ్నకు ట్రేడర్లు , ఇన్వెస్టర్ల నుండి పెద్దగా ప్రతిస్పందన కానరాలేదనే చెప్పాలి. ఎందుకంటే.. మార్కెట్లలో ట్రేడింగ్‌ సమయంలో క్రియాశీలకంగా ఉండే ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లకు  ( FPIs ) ఆసియా దేశాల్లో ఆఫీసులు ఉండనే ఉన్నాయి. ఇక ఈ పనిగంటల పొడిగింపు అన్న విషయంపై కరెన్సీ మార్కెట్ల అభిప్రాయం మాత్రం సానుకూలంగా లేదన్నది వాస్తవం. 
 Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');