ఆర్‌ఇన్‌ఫ్రా జూమ్‌- గ్రీవ్స్‌ పతనం

ఆర్‌ఇన్‌ఫ్రా జూమ్‌- గ్రీవ్స్‌ పతనం

రుణ రిజల్యూషన్‌ పథకానికి రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి అనుమతి లభించినట్లు అనిల్‌ అంబానీ గ్రూప్‌ సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తాజాగా పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు భారీ లాభాలతో సందడి చేస్తోంది. కాగా.. మరోవైపు అనుబంధ సంస్థలో వాటాను పెంచుకున్నట్లు వెల్లడించిన గ్రీవ్స్‌ కాటన్‌లో అనూహ్యంగా అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఈ షేరు నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. 

రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
అత్యధిక శాతం(60 శాతం) రుణదాతలు అంగీకరించడంతో ఆరు నెలల(180 రోజులు)లోగా రిజల్యూషన్‌ ప్లాన్‌ అమలయ్యే వీలున్నట్లు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తాజాగా పేర్కొంది. వివిధ ఆస్తుల విక్రయం తదితర అంశాలలో ప్రగతి నేపథ్యంలో ఇది విజయవంతమయ్యే అవకాశమున్నట్లు తెలియజేసింది. 16 మంది రుణదాతలతో ఇంటర్‌క్రెడిటర్‌ ఒప్పందాన్ని(ఐసీఏ) కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. మొత్తం రుణాలలో 75 శాతం విలువమేరకు రుణదాతలు అంగీకరించడం దీనికి సహకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్ ఇన్‌ఫ్రా షేరు 12 శాతం దూసుకెళ్లి రూ. 52 వద్ద ట్రేడవుతోంది. 

Image result for greaves cotton ltd

గ్రీవ్స్‌ కాటన్‌ లిమిటెడ్‌
అనుబంధ సంస్థ యాంపియర్‌ వెహికల్స్‌లో 4.77 శాతం వాటాకు సమానమైన 15,04,523 షేర్లను సొంతం చేసుకున్నట్లు ఇంజిన్ల తయారీ సంస్థ గ్రీవ్స్‌ కాటన్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ప్రైమరీ, సెకండరీ కొనుగోళ్ల ద్వారా ఇందుకు రూ. 22.5 కోట్లను వెచ్చించినట్లు తెలియజేసింది. దీంతో యాంపియర్‌ వెహికల్స్‌లో వాటా 67.34 శాతం నుంచి 72.11 శాతానికి ఎగసినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గ్రీవ్స్‌ కాటన్‌ షేరు దాదాపు 6 శాతం పతనమై రూ. 130 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 125 వరకూ తిరోగమించింది.  Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');