గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌ షేర్లకు ధరల షాక్‌

గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌ షేర్లకు ధరల షాక్‌

అంతర్జాతీయ మార్కెట్లలో గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ రంగంలోని దేశీ తయారీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఓవైపు ధరలు క్షీణించడం.. మరోపక్క అధిక సరఫరాకు అవకాశాలు వంటి ప్రతికూల పరిస్థితులు దేశీ కంపెనీల మార్జిన్లను దెబ్బతీయవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ తయారీలో ముందుండే చైనా ఇటీవల నీడిల్‌ కోక్‌, ఎలక్ట్రోడ్‌ సామర్థ్యాలను పెంచుకుంది. దీంతో డిమాండ్‌ను మించుతూ సరఫరాలు కొనసాగవచ్చన్న అంచనాలు ఇటీవల పెరిగాయి. ఇతర వివరాలు చూద్దాం..

ఆర్థిక మందగమనం
విదేశీ మార్కెట్ల సంగతి పక్కనపెడితే.. దేశీయంగా గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌కు ప్రధానంగా స్టీల్‌ పరిశ్రమ ద్వారానే డిమాండ్‌ పుడుతుంది. స్టీల్‌ పరిశ్రమలో ఎలక్ట్రిక్‌ ఆర్క్‌ ఫర్నేస్‌ తయారీలో గ్రాఫైట్స్‌ అధికంగా వినియోగిస్తారు. వీటిని ప్రధానంగా వినియోగించే పరిశ్రమలలో ఆటోమోటివ్‌, కన్‌స్ట్రక్షన్‌, అప్లయెన్సెస్, మెషీనరీ, రవాణా తదితరాలను ప్రస్తావించవచ్చు. దీంతో దేశీయంగా ఆర్థిక వ్యవస్థ పురోగతి గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ పరిశ్రమకు కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇటీవల లిక్విడిటీ సమస్యలతోపాటు.. ఆటో, అప్లయెన్సెస్‌ తదితర పరిశ్రమలు మందగమనబారిన పడుతున్న సంకేతాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. 

చైనీస్‌ ఎఫెక్ట్‌
యూహెచ్‌పీ గ్రేడ్‌ నాణ్యత కలిగిన గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ తయారీకి నీడిల్‌ కోక్‌ కీలక ముడిసరుకుగా వినియోగితమవుతుంది. అయితే నీడిల్‌ కోక్‌ సరఫరాలు తగినంత అందుబాటులో లేకపోవడంతో ఇటీవల వీటి ధరలు ఊపందుకున్నాయి. ఓవైపు నీడిల్‌ కోక్‌ వ్యయాలు పుంజుకోవడం, మరోపక్క గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ ధరలు నీరసించడంతో ప్రధానంగా దేశీ కంపెనీల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. 

షేర్లు పతనం
గ్లోబల్‌ మార్కెట్లో గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ సరఫరాలు డిమాండ్‌ను మించడంతో ధరలు ఇప్పటికే క్షీణించాయని.. భవిష్యత్‌లోనూ అమ్మకాలు, మార్జిన్లపై ఒత్తిడి కొనసాగనుందని గతేడాది(2018-19) వార్షిక నివేదికలో గ్రాఫైట్‌ ఇండియా పేర్కొంది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా పతన బాటలో సాగుతున్న గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ తయారీ కంపెనీల కౌంటర్లలో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గ్రాఫైట్‌ ఇండియా షేరు 7.2 శాతం పతనమైంది. రూ. 1190 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 1180 వద్ద 22 నెలల కనిష్టాన్ని చవిచూసింది. ఇక హెచ్‌ఈజీ లిమిటెడ్‌ షేరు సైతం 7.2 శాతం దిగజారి రూ. 284 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 276 సమీపంలో 21 నెలల కనిష్టానికి చేరింది.

65 శాతం డౌన్‌
ఈ కేలండర్‌ ఏడాది(2019)లో ఇప్పటివరకూ హెచ్‌ఈజీ లిమిటెడ్‌ షేరు 68 శాతం తిరోగమించింది. ఈ బాటలో గ్రాఫైట్‌ ఇండియా షేరు సైతం 63 శాతం కోల్పోయింది. ఇదే సమయంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 7 శాతం పుంజుకోవడం గమనార్హం! ఇంతక్రితం గ్రాఫైట్‌ ఇండియా షేరు 2017 సెప్టెంబర్‌ 17న ఈ స్థాయికి చేరగా.. హెచ్‌ఈజీ షేరు 2017 అక్టోబర్‌లో మాత్రమే ఈ స్థాయిలో ట్రేడయ్యింది!Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');