టూరిజం ఫైనాన్స్‌కు కాక్స్‌కింగ్స్‌ దెబ్బ

టూరిజం ఫైనాన్స్‌కు కాక్స్‌కింగ్స్‌ దెబ్బ

గతంలో రుణాలిచ్చిన సంస్థలకు సెక్యూరిటీగా కంపెనీలో వాటాను తనఖా ఉంచినట్లు వెల్లడించడంతో టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్‌(టీఎఫ్‌సీఐ) కౌంటర్లో తాజాగా అమ్మకాలు తలెత్తాయి. కాగా.. మరోపక్క కమర్షియల్‌ పేపర్స్‌ చెల్లింపుల్లో విఫలంకారణంగా కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతున్న కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ లిమిటెడ్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

టూరిజం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌
రుణదాతలకు సెక్యూరిటీకింద కంపెనీలో 11.5 శాతం ఈక్విటీ వాటాను తనఖా ఉంచినట్లు టూరిజం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తాజాగా పేర్కొంది. గతంలో జారీ చేసిన మార్పిడికి వీలుకాని డిబెంచర్ల(ఎన్‌సీడీలు) చెల్లింపులకు హామీగా 9.25 మిలియన్‌ ఈక్విటీ షేర్లను ఇందుకు వినియోగించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీఎఫ్‌సీఐ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 69 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 65 దిగువకు చేరింది. ఇది రెండేళ్ల కనిష్టంకాగా.. ఇంతక్రితం 2017 మార్చిలో మాత్రమే షేరు ఈ స్థాయిలో ట్రేడయ్యింది. ఇటీవల ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న  ట్రావెల్‌, లీజర్‌ సర్వీసుల సంస్థ కాక్స్‌ అండ్‌ కింగ్స్‌కు రుణాలివ్వడంతో కొద్ది రోజులుగా టీఎఫ్‌సీఐ కౌంటర్లోనూ అమ్మకాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ షేరు గత 8 ట్రేడింగ్‌ సెషన్లలో 41 శాతం వరకూ దిగజారింది.

Related image

కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ లిమిటెడ్‌
రుణ సెక్యూరిటీల చెల్లింపుల్లో విఫలం, రేటింగ్‌ సంస్థల డౌన్‌గ్రేడ్‌ తదితర ప్రతికూల వార్తలతో ఇటీవల పతన బాటలో సాగుతున్న కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ షేరు మరోసారి లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. తాజాగా రూ. 125 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్స్‌ చెల్లింపుల్లో విఫలంకావడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం  షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పతనమైంది. రూ. 23.35 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. ఈ కౌంటర్లో వరుసగా 12వ ట్రేడింగ్‌ సెషన్లోనూ అమ్మకందారులే తప్ప కొనేవాళ్లు కరవయ్యారు. వెరసి గత మూడు వారాల్లోనే ఈ షేరు 54 శాతం దిగజారింది. గత నాలుగు నెలల్లో 86 శాతం విలువ కోల్పోయింది. కాగా.. గత రెండు వారాల్లో కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ మూడోసారి రుణ సెక్యూరిటీల చెల్లింపుల్లో విఫలంకావడం గమనార్హం!Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');