సెప్టెంబర్ 1 నుండి మీ పాన్ కార్డ్ చెల్లదు...! ఆధార్‌తో లింక్ చేయకపోతే..!!

సెప్టెంబర్ 1 నుండి మీ పాన్ కార్డ్ చెల్లదు...! ఆధార్‌తో లింక్ చేయకపోతే..!!

సెప్టెంబర్ 1 నాటికి ఆధార్‌తో అనుసంధానించబడని అన్ని పాన్ కార్డులను ప్రభుత్వం చెల్లదని ప్రకటించింది. ప్రస్తుతమున్న 400 మిలియన్ పాన్ కార్డులలో 180 మిలియన్ల పాన్ కార్డులు  ఆధార్‌తో అనుసంధానించబడలేదు. ప్రస్తుత పాన్ కార్డులను ధృవీకరించడానికి మరియు ఉపయోగించడానికి ఖచ్చితంగా ఇకపై ఆధార్‌తో లింక్ చేయబడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లేక పోతే రిటర్న్స్ దాఖలు చేయడానికి , పన్ను సంబంధిత లావాదేవీలకు వ్యక్తి గత గుర్తింపు వర్తించదు. ఇప్పటికే పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకున్నట్టైతే.. ఇకపై మీరు ట్యాక్స్ రిటర్న్‌ సమయంలో కేవలం ఆధార్ కార్డు నెంబర్ ఉదహరిస్తే..సరిపోతుందని ట్యాక్స్  నిపుణులు పేర్కొంటున్నారు. 
ఈ బడ్జెట్‌లో IT (ఇన్‌కం ట్యాక్స్) చట్టం కింద సెప్టెంబర్ 1 తరువాత అధిక మొత్తంలో లావాదేవీలు జరిపే వారి ఆధార్ నెంబర్ తప్పనిసరిగా వారి వారి రిటర్న్స్ లో పేర్కొనాలని ప్రభుత్వం అంటుంది. ప్రస్తుతం దేశంలో సుమారు 220 మిలియన్ల పాన్ కార్డులు ఆధార్‌తో లింక్ కాబడి ఉన్నాయి. మిగిలిన 180 మిలియన్ల పాన్ కార్డులు ఆధార్‌తో లింక్ కాలేదు. సెప్టెంబర్ 1 2019 తరువాత ఆధార్‌తో లింక్ కాబడని పాన్ కార్డులను సస్పెన్షన్‌లో ఉంచబోతున్నామని ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాన్ కార్డు లేని వారు ఒక వేళ ఐటీ రిటర్న్స్ ను ఆధార్ ద్వారా సమర్పించాలంటే.. ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వారికి ఒక స్వయం చాలక కొత్త పాన్ నెంబర్‌ను కేటాయిస్తుంది. దీన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆతరువాత ఈ కొత్త పాన్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు 2019 బడ్జెట్‌ను ఆమోదించిన తర్వాత పాన్-ఆధార్ అనుసంధానం ఎలా అమలు చేయబడుతుందో వివరిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఐటీ రిటర్న్స్ , పెద్ద మొత్తంలో ఆర్ధిక లావాదేవీలు వంటి వాటి విషయంలో IT చట్టంలో సబ్ సెక్షన్‌ 6 B ను చేర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా వినియోగ దారులు, లేదా ట్యాక్స్ పేయర్స్ ఆధార్ , పాన్ కార్డుల ప్రామాణికతను తనిఖీ చేసే బాధ్యత ప్రభుత్వానికి దఖలు పడనుంది. 
2019 మార్చిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (CBDT),  ఆధార్ నంబర్‌ను తెలియజేయడానికి మరియు పాన్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని ఆరు నెలల వరకు సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అయితే, ఏప్రిల్ 1 నుండి, కోట్ చేయడం మరియు ఆధార్ నంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆర్ధిక సంస్థలకు, ప్రైవేట్ ఆడిటర్లకు తెలియజేశామని ఆర్ధిక మంత్రిత్వ వర్గాలు పేర్కొన్నాయి. 


 tv5awards