సెన్సెక్స్ డబుల్‌- కొనుగోళ్ల దన్ను

సెన్సెక్స్ డబుల్‌- కొనుగోళ్ల దన్ను

వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ ప్రోత్సాహకరంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ పావెల్‌ తాజాగా వడ్డీ తగ్గింపు సంకేతాలు ఇవ్వడంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడగా.. ఆసియాలోనూ సానుకూల ట్రెండ్‌ కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. అన్ని రంగాలలోనూ కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం డబుల్‌ సెంచరీని సైతం సాధించింది. 245 పాయింట్లు జంప్‌చేసి 38,802కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 76 పాయింట్లు పుంజుకుని 11,575 వద్ద ట్రేడవుతోంది. బడ్జెట్‌ తదుపరి నాలుగు రోజులుగా దేశీ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలుస్తున్న విషయం విదితమే.

రియల్టీ, ఫార్మా జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మీడియా, రియల్టీ, ఫార్మా, బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ 1.7-0.7 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ,  జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్‌ఇండ్‌,  ఐబీ హౌసింగ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హీరో మోటో,  హిందాల్కో, అల్ట్రాటెక్‌, గెయిల్‌, సిప్లా 4-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే యస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, ఐవోసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ 2-0.7 శాతం మధ్య నీరసించాయి.

ఇండిగో డీలా
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌, ఒరాకిల్‌, అరబిందో, భారత్ ఫోర్జ్‌, కేడిలా హెల్త్‌, ఐడియా, ఎల్‌ఐసీ హౌసింగ్‌ 4.5-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క ఇండిగో 5.25 శాతం పతనమైంది. ఈ బాటలో ఎన్‌ఎండీసీ, బిర్లా సాఫ్ట్‌, హావెల్స్‌, ఎన్‌సీసీ, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, హెక్సావేర్‌, బాటా ఇండియా 3-2 శాతం మధ్య క్షీణించాయి. 

మిడ్‌ క్యాప్స్‌ అప్‌
మార్కెట్లు హుషారుగా ట్రేడవుతున్న నేపథ్యంలో మధ్యతరహా షేర్లలో సానుకూల ట్రెండ్‌ కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్ క్యాప్‌ 0.5 శాతం పుంజుకుంది. ఇప్పటివరకూ 1054 షేర్లు లాభపడగా.. 1026 నష్టాలతో కదులుతున్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో టాటా కమ్యూ, రిలయన్స్ ఇన్ఫ్రా, ఎంఫసిస్‌, ఇమామీ, ముత్తూట్‌, గ్లెన్‌మార్క్‌, టాటా గ్లోబల్‌, టీవీఎస్‌ మోటార్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తదితరాలు 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');