హిమాచల్‌- గ్లెన్‌మార్క్‌.. ఖుషీ

హిమాచల్‌- గ్లెన్‌మార్క్‌.. ఖుషీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఆప్టికల్‌ కేబుల్‌, టెలికం పరికరాల తయారీ సంస్థ హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఎఫ్‌సీఎల్‌) కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క డయాబెటిస్‌ వ్యాధి చికిత్సకు వినియోగించగల ఔషధానికి టొరంట్‌ ఫార్మాస్యూటికల్స్‌తో లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌ కౌంటర్‌  వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. 

హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ 
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్)లో హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. నికర లాభం 148 శాతం దూసుకెళ్లి రూ. 117 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 23 శాతం ఎగసి రూ. 1343 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 104 శాతం పెరిగి రూ. 194 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌ఎఫ్‌సీఎల్‌ షేరు 7.2 శాతం జంప్‌చేసి రూ. 22 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 64ను సైతం అధిగమించింది. కంపెనీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ఆప్టికల్‌ ఫైబర్‌ తయారీ ప్లాంటు చివరి దశకు చేరినట్లు హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ పేర్కొంది. నవంబర్‌కల్లా కార్యకలాపాలు ప్రారంభంకావచ్చని తెలియజేసింది.

Image result for glenmark pharma

గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌
డయాబెటిస్‌ వ్యాధి చికిత్సలో వినియోగించే రెమోగ్లిఫ్లోజెన్‌ ఔషధ మార్కెటింగ్‌కు వీలుగా టొరంట్‌ ఫార్మాతో సబ్‌లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గ్లెన్‌మార్క్‌ ఫార్మా పేర్కొంది. తద్వారా సోడియం గ్లూకోజ్‌ కో ట్రాన్స్‌పోర్టర్‌-2 ఇన్‌హిబిటర్‌ను టొరంట్‌ ఫార్మా ద్వారా మార్కెట్లో విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఈ ఔషధాన్ని టొరంట్‌ ఫార్మా సొంత బ్రాండు జుకాటర్‌ పేరుతో దేశీయంగా విడుదల చేయనుంది. దీంతో ముందస్తు పేమెంట్‌, లైసెన్స్‌ ఫీజు, రాయల్టీలను అందుకోనున్నట్లు గ్లెన్‌మార్క్‌ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేరు 2.3 శాతం బలపడి రూ. 456 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 459కు ఎగసింది. ఇక టొరంట్ ఫార్మా సైతం ఇంట్రాడేలో 2 శాతం పుంజుకుని రూ. 1578ను తాకింది. ప్రస్తుతం నామమాత్ర లాభంతో రూ. 1552 వద్ద ట్రేడవుతోంది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');