ప్రీమియర్‌ 'ఎక్స్‌ప్లోజివ్స్‌'- ఇండిగో వీక్‌

ప్రీమియర్‌ 'ఎక్స్‌ప్లోజివ్స్‌'- ఇండిగో వీక్‌

రక్షణ రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) నుంచి ఆర్డర్ లభించినట్లు పేర్కొనడంతో ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోవైపు కంపెనీ ప్రమోటర్లలో విభేధాల నేపథ్యంలో ఇండిగో బ్రాండు విమానయాన సర్వీసుల సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ కౌంటర్లో వరుసగా రెండో రోజు అమ్మకాలు కొనసాగుతున్నాయి. వివరాలు చూద్దాం.. 

ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌
ప్రభుత్వ రంగ సంస్థ బీడీఎల్‌ నుంచి రూ. 15 కోట్ల విలువైన ఆర్డర్‌ లభించినట్లు కమర్షియల్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీ ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ పేర్కొంది. కాంట్రాక్టులో భాగంగా ఎయిర్‌ మిస్సైల్స్‌ తయారీలో వినియోగించగల సోలిడ్‌ ప్రొపెల్లెంట్స్‌, మధ్యస్థాయి(మీడియం రేంజ్‌) సర్ఫేస్‌లను సరఫరా చేయవలసి ఉంటుందని తెలియజేసింది. కాంట్రాక్టును 14 నెలల్లోగా పూర్తిచేయవలసి ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ షేరు 3 శాతం ఎగసి రూ. 190 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 196 వరకూ జంప్‌చేసింది.

Image result for interglobe aviation limited

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌
ప్రమోటర్‌ రాకేష్‌ గంగ్వాల్‌ తాజాగా కంపెనీ బోర్డును విస్తరించాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. తద్వారా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ల సంఖ్యను పెంచాలని యోచిస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా కంపెనీ యాజమాన్య నిర్వహణలో 37 శాతం వాటా కలిగిన తాము సమాన హక్కులను పొందే ఏవోఏ అంశంపై కలుగజేసుకోవలసిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని అభ్యర్థించారు. 75 శాతం వాటాదారుల మద్దతులేకుండా ఇది సాధ్యపడదంటూ సహప్రమోటర్‌ రాహుల్‌ భాటియా పేర్కొన్న నేపథ్యంలో గంగ్వాల్‌ తాజా చర్యలకు తెరతీసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు 6.3 శాతం పతనమై రూ. 1310 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1273 వరకూ జారింది. కాగా.. ప్రమోటర్ల మధ్య వివాదాలు తలెత్తిన కారణంగా బుధవారం సైతం ఈ షేరు 10 శాతం కుప్పకూలి రూ. 1398 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');