మహీంద్రా అత్యుత్సాహం ముందు నిలబెడ్తుందా ?

మహీంద్రా అత్యుత్సాహం ముందు నిలబెడ్తుందా ?

డీజిల్ , పెట్రోల్ కార్ల నుండి వెలువడే విషరసాయనాలు, కాలుష్యం వంటి వాటిని తగ్గించడానికి ప్రభుత్వం భారత్ స్టేజ్ (BS) 1, 2, 6 వంటి ప్రమాణాలను నిర్దేశించింది. తాజాగా BS-6 ప్రమాణాలను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుండి అమలు చేయనుంది. దీంతో పలు కార్ల కంపెనీలు సతమతమౌతున్నాయి. ఇప్పటికే ప్రవేశ పెట్టిన పలు కొత్త కార్ మోడల్స్ లో ఈ BS-6 ప్రమాణాలకు అనుగుణంగా చాలా కార్లు లేవు. అంతే కాకుండా ఇప్పుడున్న వాటి ఇంజిన్లను ఈ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయాలంటే అధిక వ్యయ ప్రయాసలు కార్ల కంపెనీలకు ఎదురౌతాయి. పలు కార్ల కంపెనీలు ఈ విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా చేశాయి. కానీ కేంద్ర ప్రభుత్వం BS 6 ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని హుకం జారీ చేసింది. 

Image result for mahindra vehicles
అయితే ఈ పరిణామాలు మహీంద్రాకు కలిసొచ్చేలా ఉన్నాయి. మహీంద్ర ఇప్పటి దాకా ఉత్పత్తి చేస్తున్న మోడల్స్ లో విక్రయాలు క్షీణించడంతో ఆయా ఉత్పత్తులను నిలిపి వేసి కొత్తగా BS 6 ప్రమాణాలతో సరికొత్త మోడల్స్ ను విపణిలో విడుదల చేయాలని యోచిస్తుంది మహీంద్రా. ఈ కంపెనీకి చెందిన స్కార్పియో, XUV500 వంటి మోడల్స్ ను సరికొత్త ఇంజిన్లతో , పవర్ ట్రైన్స్ పరిజ్ఞానంతో తయారు చేసి మార్కెట్లలోకి విడుదల చేయడానికి మహీంద్రా ఇప్పటికే ఫోర్డ్ కంపెనీతో ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ లేక పోయినా.. గ్జైలో, వెరిటో, వైబ్ వంటి మోడల్స్ ను ఈ ముంబై బేస్‌డ్ కంపెనీ ఉత్పత్తి చేస్తూనే వచ్చింది. స్థానిక ఉత్పత్తి కర్మాగారాలు ఉండటం, స్వదేశీ పరిజ్ఞానాన్ని వాడటం వల్ల ఈ మోడల్స్ ఉత్పత్తి ఖర్చు పెద్దగా భారం కాలేదు. కానీ మహీంద్రా ఈ చర్యల వల్ల మార్కెట్ షేర్లు కుదుపులకు లోనవుతూ వచ్చాయి. రా మెటిరీయల్ ఖర్చలు, అధిక నిర్వాహణ వ్యయాలు కంపెనీకి భారంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన BS 6 నిబంధనలు మహీంద్రాకు కలిసొచ్చాయనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్న మోడల్స్ ను ఉద్గార నిబంధనలకునుగుణంగా మార్చాలంటే అధిక వ్యయం అవుతుంది కాబట్టి అసలు మొత్తం పాత మోడల్స్ ఉత్పత్తిని నిలిపివేసి కొత్త మోడల్స్‌ను పరిచయం చేయాలని మహీంద్రా భావిస్తోంది. కంపెనీ మోడల్స్ పోర్ట్ ఫోలియోను పూర్తిగా మార్చి వేయాలని మహీంద్రా యోచిస్తున్నట్టు సమాచారం.

Image result for mahindra vehicles

BS 6 రోల్‌ అవుట్ కింద కంపెనీ పోర్ట్ ఫోలియోను సమూలంగా మార్చి వేస్తున్నట్టు M&M మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా పేర్కొన్నారు. BS 4 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న తమ 5 ప్లాట్‌ఫామ్స్ ను మూసివేస్తున్నామని గోయెంకా తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన BS 6 నిబంధనలు తమ పోర్ట్ ఫోలియోను క్లీన్‌అప్ చేసుకోడానికి దోహద పడిందని గోయెంకా అంటున్నారు. 2020 ఏప్రిల్ 1 నాటికి మహీంద్రాలో పాత మోడల్స్ ఏవీ కనబడవని పవన్ గోయెంకా పేర్కొంటున్నారు.  కేంద్ర ప్రభుత్వం BS 6 రోల్‌అవుట్‌ ను 2022 నుండి 2020 వరకు తగ్గించింది. 2020 నాటికి అన్ని కార్ల కంపెనీలు ఈ ప్రమాణాలు పాటించాల్సిందేనని ఆర్డర్లు జారీ చేసింది. దీంతో పలు కంపెనీలు అభ్యంతరం తెలిపాయి. ఇప్పటికే ఉన్న లక్షల వెహికల్స్ ఇంజిన్లను BS 6 ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలంటే ... అధిక వ్యయం అవుతుందన్నది కార్ల కంపెనీల వాదన.

Image result for mahindra electric car

ప్రస్తుతం BS 6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు తయారు చేస్తే.. థార్ మోడల్స్ లో కనిపించే CRDE, డైరెక్ట్ ఇంజెక్షన్ (DI) ఇంజిన్లు మాయం అయిపోతాయి. BS 6 నిబంధనలకు అనుగుణంగా మహీంద్రా , ఫోర్డ్ సంయుక్త భాగస్వామ్యంతో కొత్తగా 5 ప్లాట్‌ఫామ్స్ ను ఏర్పరుస్తుంది. స్పోర్ట్స్ పర్పస్ వెహికిల్ (SUV) తయారీలో పూర్తిగా కాలుష్య , ఉద్గార నిబంధనలను పాటిస్తామని, పెట్రోల్ ఇంజిన్ల కార్లనే ఎక్కువగా తయారు చేయబోతున్నామని గోయెంకా పేర్కొన్నారు. అంతే కాకుండా ఫోర్డ్ కంపెనీతో ఉన్న టైఅప్‌ ద్వారా ఫోర్డ్ ఆస్పైర్ పేరిట ఎలక్ట్రిక్ వెహికిల్‌ను కూడా మార్కెట్లోకి లాంఛ్ చేయనున్నట్టు ఆయన తెలిపారు.  
 Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');