రెలిగేర్‌- జీటీపీఎల్‌.. కొనుగోళ్ల కిక్‌

రెలిగేర్‌- జీటీపీఎల్‌.. కొనుగోళ్ల కిక్‌

అనుబంధ సంస్థ రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌లో పూర్తి వాటాను విక్రయించేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీ రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో డిజిటల్‌ కేబుల్‌ టీవీ, బ్రాడ్‌బ్యాండ్‌ సేవల సంస్థ జీటీపీఎల్‌ హాథవే లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. 

రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌
అనుబంధ సంస్థ రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ను విక్రయించేందుకు ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ టీసీజీ అడ్వయిజరీతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా పేర్కొంది. అయితే ఒప్పంద నిబంధనల్లో భాగంగా విక్రయ విలువను వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. అంతా కొనుగోలుదారులే తప్ప అమ్మేవాళ్లు కరవుకావడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 43 వద్ద ఫ్రీజయ్యింది. ఇప్పటికే ఈ కౌంటర్లో 5.5 లక్షలకుపైగా షేర్లు చేతులుమారగా.. 2.15 లక్షల షేర్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. గత వారం రోజుల్లో అంటే ఈ నెల 5 నుంచీ రెలిగేర్‌ షేరు 51 శాతం దూసుకెళ్లడం గమనార్హం!

Image result for gtpl hathway

జీటీపీఎల్‌ హాథవే 
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జీటీపీఎల్‌ హాథవే లిమిటెడ్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. నికర లాభం 120 శాతం జంప్‌చేసి రూ. 29 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 50 శాతం ఎగసి రూ. 445 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 38 శాతం పెరిగి రూ. 116 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జీటీపీఎల్‌ హాథవే షేరు 15 శాతం దూసుకెళ్లింది. రూ. 62 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 64ను సైతం అధిగమించింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');