సెంచరీతో.. అన్ని రంగాలూ ప్లస్‌

సెంచరీతో.. అన్ని రంగాలూ ప్లస్‌

నాలుగు రోజుల నష్టాలకు చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ పావెల్‌ తాజాగా వడ్డీ తగ్గింపు సంకేతాలు ఇవ్వడంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడగా.. ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ట్రెండ్‌ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. ప్రస్తుతం 102 పాయింట్లు పెరిగి 38,659కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 36 పాయింట్లు పుంజుకుని 11,535 వద్ద ట్రేడవుతోంది. బడ్జెట్‌ తదుపరి నాలుగు రోజులుగా దేశీ మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలుస్తున్న విషయం విదితమే.

మెటల్‌, ఫార్మా జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్‌, ఫార్మా, రియల్టీ 1.7-1 శాతం మధ్య బలపడ్డాయి. ఫార్మా, మెటల్‌ 0.6 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, వేదాంతా, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా స్టీల్‌, జీ, ఎస్‌బీఐ, హిందాల్కో, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, యస్‌ బ్యాంక్‌ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే టెక్‌ మహీంద్రా, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ, ఐబీ హౌసింగ్‌, ఇన్ఫోసిస్‌ 1.5-0.7 శాతం మధ్య నీరసించాయి.

డెరివేటివ్స్‌ ఇలా
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో అరబిందో, జిందాల్‌ స్టీల్‌, డీఎల్‌ఎఫ్‌, టాటా గ్లోబల్‌, పిరమల్‌ 2.5-2 శాతం మధ్య లాభపడగా.. ఇండిగో 5 శాతం పతనమైంది. ఈ బాటలో బిర్లా సాఫ్ట్‌, ఎన్‌సీసీ, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, హెక్సావేర్‌, బాటా ఇండియా, హావెల్స్‌, ఆర్‌ఈసీ 3-1 శాతం మధ్య క్షీణించాయి. 

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు హుషారుగా ప్రారంభమైన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లలో సానుకూల ట్రెండ్‌ కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 0.25 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ 827 షేర్లు లాభపడగా.. 457 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో జీటీపీఎల్‌, రెలిగేర్‌, హెచ్‌ఎఫ్‌సీఎల్‌, ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌, డెన్, మొహతా, ప్రైమ్‌ఫోకస్‌, స్టైలమ్‌, కేఎస్‌ఎల్‌, రెడింగ్టన్‌ తదితరాలు 16-4 శాతం మధ్య జంప్‌చేశాయి.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');