పావెల్‌ పుష్‌- సరికొత్త రికార్డ్స్‌

పావెల్‌ పుష్‌- సరికొత్త రికార్డ్స్‌

కాంగ్రెస్‌ కమిటీ ముందు దేశ ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలపై ప్రసంగించిన కేంద్ర బ్యాంకు చైర్మన్‌ జెరోమీ పావెల్‌ మళ్లీ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈ నెలాఖరున చేపట్టనున్న పాలసీ సమీక్షలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాలు ప్రకటించవచ్చన్న అంచనాలు తాజాగా బలపడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. డోజోన్స్‌ 77 పాయింట్లు(0.3 శాతం) బలపడి 26,860 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 13 పాయింట్లు(0.5 శాతం) పుంజుకుని 2,993 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 61 పాయింట్ల(0.75 శాతం) ఎగసి 8,202 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్ చరిత్రలో తొలిసారి ఇంట్రాడేలో ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌ 3,000 పాయింట్లను అధిగమించింది! ఈ బాటలో డోజోన్స్‌ సైతం ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకోగా.. నాస్‌డాక్‌ తొలిసారి 8,200 పాయింట్లకు ఎగువన ముగియడం విశేషం!

Related image

ఫాంగ్‌ స్టాక్స్‌ దన్ను
ప్రధానంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌, సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌, ఐఫోన్ల బ్లూచిప్‌ కంపెనీ యాపిల్‌ బలపడటంతో అటు ఎస్‌అండ్‌పీ, ఇటు నాస్‌డాక్‌ సరికొత్త రికార్డులను అందుకున్నాయి. అమెజాన్‌ 1.5 శాతం పుంజుకోవడం ద్వారా 2000 డాలర్లను అధిగమించింది. వాహనాలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తిని పెంచనున్నట్లు పేర్కొనడంతో ఆటో రంగ దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 3 శాతం ఎగసింది.
 
ఆసియా ప్లస్‌లో..
బుధవారం యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు యూకే, ఫ్రాన్స్‌ నామమాత్ర నష్టాలతో నిలవగా, జర్మనీ 0.5 శాతం నీరసించింది. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సానుకూల ట్రెండ్‌ కనిపిస్తోంది. హాంకాంగ్‌, కొరియా, సింగపూర్‌, చైనా, జపాన్‌, తైవాన్‌, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా 1.2-0.2 శాతం మధ్య ఎగశాయి. కాగా.. వడ్డీ రేట్ల తగ్గింపుపై పావెల్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ మూడు వారాల గరిష్టం నుంచి వెనకడుగు వేసింది. 97.05కు చేరింది. యూరో 1.125ను తాకగా.. జపనీస్‌ యెన్‌ 108.32కు బలపడింది. ట్రెజరీ ఈల్డ్స్‌ 2.052 శాతానికి స్వల్పంగా నీరసించాయిMost Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');