నేడు లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌?!

నేడు లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 47 పాయింట్లు ఎగసి 11,541 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాంగ్రెస్‌ వద్ద ప్రసంగించిన ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలున్నట్లు పేర్కొనడంతో బుధవారం ఒక్కసారిగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. ఈ నెలాఖరున చేపట్టనున్న పాలసీ సమీక్షలో ఫెడ్‌ వడ్డీ తగ్గింపును చేపట్టవచ్చన్న అంచనాలు ఊపందుకున్నాయి. దీంతో బుధవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. కాగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత వారాంతాన బడ్జెట్‌ ప్రకటించాక దేశీ స్టాక్‌ మార్కెట్లలో తలెత్తిన అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

నాలుగో రోజూ నష్టాలు తప్పలేదు!
బుధవారం స్వల్ప ఊగిసలాటతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో మిడ్‌సెషన్‌కు ముందుగానే అమ్మకాలు ఊపందుకున్నాయి. చివరివరకూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో రోజంతా నష్టాల మధ్యే మార్కెట్లు కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 174 పాయింట్లు క్షీణించి 38,557 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 57 పాయింట్ల వెనకడుగుతో 11,499 వద్ద స్థిరపడింది. వెరసి నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,500 పాయింట్ల దిగువన ముగిసింది. ఫలితంగా మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టాక వరుసగా నాలుగో రోజు మార్కెట్లు వెనకడుగుతో ముగిసినట్లయ్యింది.

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,452 పాయింట్ల వద్ద, తదుపరి 11,408 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,570 పాయింట్ల వద్ద, తదుపరి 11,641 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 30,391, 30,260 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 30,691, 30,859 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

డీఐఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 605 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 667 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 674 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు రూ. 711 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. 



Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');