నాలుగో రోజూ నష్టాలు తప్పలేదు!

నాలుగో రోజూ నష్టాలు తప్పలేదు!

స్వల్ప ఊగిసలాటతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో మిడ్‌సెషన్‌కు ముందుగానే అమ్మకాలు ఊపందుకున్నాయి. చివరివరకూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో రోజంతా నష్టాల మధ్యే మార్కెట్లు కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 174 పాయింట్లు క్షీణించి 38,557 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 57 పాయింట్ల వెనకడుగుతో 11,499 వద్ద స్థిరపడింది. వెరసి నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,500 పాయింట్ల దిగువన ముగిసింది. ఫలితంగా మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టాక వరుసగా నాలుగో రోజు మార్కెట్లు వెనకడుగుతో ముగిసినట్లయ్యింది. 

రియల్టీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, మెటల్, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 1.7-0.8 శాతం మధ్య నీరసించాయి. రియల్టీ స్టాక్స్‌లో ఒబెరాయ్‌, డీఎల్‌ఎఫ్‌, శోభా,  బ్రిగేడ్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ 4-3 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే మహీంద్రా లైఫ్‌, ఫీనిక్స్‌, ఇండియాబుల్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 2.5-1.2 శాతం చొప్పున ఎగశాయి. కాగా.. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్‌, బజాజ్‌ ఫిన్‌, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌, హిందాల్కో, ఐవోసీ 5-2.2 శాతం మధ్య నష్టపోయాయి. అయితే యస్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో, గ్రాసిమ్‌ 2-0.5 శాతం మధ్య బలపడ్డాయి. 

ఇండిగో పతనం
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో ఇండిగో 11 శాతం కుప్పకూలగా.. రిలయన్స్‌ కేపిటల్‌, డిష్‌ టీవీ, అరవింద్‌, బిర్లా సాఫ్ట్‌, అదానీ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఎల్‌ఐసీ హౌసింగ్‌, జస్ట్‌ డయల్‌ 8-5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు ఆర్‌ఈసీ, ఎన్‌ఎండీసీ, పేజ్‌ ఇండస్ట్రీస్, పీవీఆర్‌, లుపిన్‌, రామ్‌కో సిమెంట్‌, కంకార్‌, దివీస్‌ లేబ్స్‌ 4.5-1.4 శాతం మధ్య ఎగశాయి. 

మిడ్‌ క్యాప్స్‌ డౌన్‌
మార్కెట్లు నష్టాలతో ముగిసిన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లలో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.75 శాతం చొప్పున నీరసించాయి. 1495 షేర్లు నష్టపోగా.. 947 మాత్రమే లాభాలతో ముగిశాయి. 

డీఐఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 674 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 711 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా.. గత రెండు రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 491 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 597 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');