బజాజ్‌ ద్వయం.. మళ్లీ బోర్లా

బజాజ్‌ ద్వయం.. మళ్లీ బోర్లా

వరుసగా నాలుగో రోజు ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆటుపోట్లను చవిచూస్తున్న ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజాలు బజాజ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ లిమిటెడ్‌ కౌంటర్లు మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ వారం ఆరంభంలో ఉన్నట్టుండి అనూహ్యంగా పతనమైన ఈ రెండు కౌంటర్లూ ఆర్థిక ఫలితాలు, ట్రేడర్ల షార్ట్‌కవరింగ్‌ కారణంగా మంగళవారం తిరిగి బౌన్స్‌బ్యాక్‌ సాధించిన విషయం విదితమే. కాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు 4 శాతంపైగా పతనమై రూ. 3,457 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ షేరు సైతం 2.35 శాతం క్షీణించి రూ. 7,673 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 7,645 వరకూ నీరసించింది.

Related image

ఏం జరిగిందంటే?
ఫైనాన్సింగ్‌ రంగ దిగ్గజం బజాజ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ షేరుకి మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా ఈక్వల్‌ వెయిట్‌ రేటింగ్‌ను ప్రకటించింది. అంతేకాకుండా రూ. 2,950 టార్గెట్‌ ధరను ప్రకటించింది. మంగళవారం ముగింపు రూ. 3603తో పోలిస్తే ఇది 18 శాతం తక్కువకాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో బజాజ్‌ ఫైనాన్స్‌ మెరుగైన పనితీరును కనబరిచిన వార్తలతో మంగళవారం ఈ షేరు బౌన్స్‌బ్యాక్‌ సాధించింది. ఎన్‌ఎస్ఈలో బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 3603 వద్ద నిలవగా.. గ్రూప్‌లోని మరో కంపెనీ బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ షేరు సైతం 5 శాతం ఎగసి రూ. 7855 వద్ద ముగిసింది. అంతక్రితం సోమవారం ఈ రెండు కౌంటర్లూ భారీగా పతనమైన సంగతి తెలిసిందే. 

ఫలితాలు ఓకే
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)కల్లా కస్టమర్‌ ఫ్రాంచైజీ 36.9 మిలియన్లకు చేరినట్లు ఫైనాన్సింగ్‌ రంగ దిగ్గజం బజాజ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ పేర్కొంది. గతేడాది(2018-19) క్యూ1లో ఇవి 28.3 మిలియన్లుకాగా.. కొత్తగా 2.5 మిలియన్‌ కస్టమర్లను జత చేసుకున్నట్లు తెలియజేసింది. కొత్త రుణాల బుకింగ్స్‌ గత క్యూ1లో నమోదైన 5.6 మిలియన్లతో పోలిస్తే 7.3 మిలియన్లకు పెరిగినట్లు వెల్లడించింది. నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) గత క్యూ1లో నమోదైన రూ. 91287 కోట్ల నుంచి రూ. 1.29 లక్షల కోట్లకు ఎగసినట్లు తెలియజేసింది. ఇది 41 శాతం వృద్ధికావడం విశేషం! అయితే వినియోగ వ్యయాలు మందగిస్తున్న కారణంగా కంపెనీ ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడవచ్చన్న అంచనాలతో సోమవారం బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్న విషయం విదితమే. దీంతో సోమవారం బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు 8 శాతం పతనమై రూ. 3413 వద్ద ముగిసింది. ఈ బాటలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ సైతం10 శాతం కుప్పకూలి రూ. 7593 వద్ద స్థిరపడింది. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');