నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు.. కేక

నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు.. కేక

మార్కెట్లు అమ్మకాలతో డీలాపడినప్పటికీ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ కౌంటర్లు నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పెరగడం గమనించదగ్గ అంశం. జాబితాలో మిండా ఇండస్ట్రీస్‌, కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్, ఎన్‌ఎండీసీ, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌..చోటు సంపాదించాయి. ఇతర వివరాలు చూద్దాం..

మిండా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 302 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 304 వరకూ ఎగసింది. గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం సగటున 6,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్‌లో 33,000 షేర్లు చేతులు మారాయి. 

కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 503 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 510 వరకూ ఎగసింది. గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 7,800 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్‌లో 10,400 షేర్లు చేతులు మారాయి. 

ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌:  ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4 శాతం పురోగమించి రూ. 114 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 116.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3.2 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్‌లో 5 లక్షల షేర్లు చేతులు మారాయి. 

ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌: మహారాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాల సబ్సిడీ కింద అదనంగా రూ. 44.6 కోట్లకు అనుమతించినట్లు వెల్లడించడంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి  రూ. 53 వద్ద ట్రేడవుతోంది. గత 20 రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణంతో పోలిస్తే మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్‌లో 15 రెట్లు అధికంగా షేర్లు చేతులు మారాయి.Most Popular