లాభాల 'టేస్టీ బైట్‌'- ఆర్‌ఈసీ రికవర్‌

లాభాల 'టేస్టీ బైట్‌'- ఆర్‌ఈసీ రికవర్‌

నిధుల సమీకరణ ప్రణాళికలు వెల్లడించడంతో స్పెషాలిటీ ఫుడ్స్‌ తయారీ సంస్థ టేస్టే బైట్‌ ఈటబుల్స్‌ లిమిటెడ్‌ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క ఎన్‌ఎస్‌ఈ ప్రభుత్వ రంగ సంస్థల(సీపీఎస్‌ఈ) ఇండెక్స్‌ నుంచి తప్పించిన వార్తలతో మంగళవారం భారీగా పతనమైన విద్యుత్‌ రంగ పీఎస్‌యూ సంస్థ ఆర్‌ఈసీ లిమిటెడ్‌ కౌంటర్ బౌన్స్‌బ్యాక్‌ సాధించింది. ఇన్వెస్టర్లు ఈ రెండు కౌంటర్లలోనూ కొనుగోళ్లకు ఎగబడటంతో నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. 

టేస్టీ బైట్‌ ఈటబుల్స్‌
ప్రత్యేక తరహా ఆహారోత్పత్తుల సంస్థ టేస్టీ బైట్‌ ఈటబుల్స్‌ లిమిటెడ్‌ నిధుల సమీకరణ ప్రణాళికలు వెల్లడించింది. ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన సెక్యూరిటీల జారీ తదితర మార్గాలలో అవసరమైన పెట్టుబడులను సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. ఈ ప్రతిపాదనలపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 12న(శుక్రవారం) సమావేశంకానున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టేస్టీ బైట్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 9.4 శాతం దూసుకెళ్లి రూ. 9,383 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో దాదాపు 20 శాతం జంప్‌చేసింది. రూ. 10,280 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 

Image result for REC Ltd

ఆర్‌ఈసీ లిమిటెడ్‌
ప్రభుత్వ రంగ సంస్థల(సీపీఎస్‌ఈ)తో కూర్చే నిఫ్టీ సీపీఎస్‌ఈ నుంచి తొలగించేందుకు ఎన్‌ఎస్‌ఈ ఇండెక్సుల సబ్‌కమిటీ నిర్ణయించడంతో ముందు రోజు భారీగా పతనమైన విద్యుత్‌ రంగ పీఎస్‌యూ సంస్థ ఆర్‌ఈసీ లిమిటెడ్‌ కౌంటర్‌ బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఆర్‌ఈసీ షేరు 4.2 శాతం జంప్‌చేసి రూ. 143 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఈ షేరు 14 శాతంపైగా కుప్పకూలి రూ. 137 వద్ద ముగిసిన విషయం విదితమే. దాదాపు మూడేళ్ల తరువాత ఇది అత్యధిక పతనంకాగా.. నిఫ్టీ సీపీఎస్‌ఈలో ప్రభుత్వానికి కనీసం 51.5 శాతం వాటా కలిగిన కంపెనీలనే పరిగణిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తెలియజేసింది. ఆర్‌ఈసీని తప్పించడంతో ప్రస్తుతం సీపీఎస్‌ఈ ఇండెక్స్‌లో 10 స్టాక్స్‌ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ కింద బాండ్లు, డిబెంచర్ల జారీ ద్వారా రూ. 75,000 కోట్ల సమీకరణకు నేడు సమావేశమైన బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఆర్‌ఈసీ తెలియజేసింది. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');