నష్టాల బాట- మెటల్‌, బ్యాంక్స్‌ డౌన్‌

నష్టాల బాట- మెటల్‌, బ్యాంక్స్‌ డౌన్‌

స్వల్ప ఊగిసలాటతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 168 పాయింట్లు క్షీణించి 38,562కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 51 పాయింట్ల వెనకడుగుతో 11,506 వద్ద ట్రేడవుతోంది. బడ్జెట్‌ నిరాశపరచడం, అమెరికా మార్కెట్ల నష్టాలు, రూపాయి బలహీనపడటం తదితర ప్రతికూల అంశాల కారణంగా వరుసగా నాలుగో రోజు మార్కెట్లు అమ్మకాలతో నీరసించినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

రియల్టీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ, ఆటో 2-1 శాతం మధ్య నీరసించాయి. మెటల్‌ కౌంటర్లలో జిందాల్‌ స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సెయిల్‌, టాటా స్టీల్‌, వేదాంతా, హిందాల్కో, నాల్కో 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌, బ్రిగేడ్‌, శోభా, సన్‌టెక్‌ 4-1.5 శాతం మధ్య క్షీణించగా.. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఫీనిక్స్ 2 శాతం చొప్పున ఎగశాయి. 

ఇండిగో పతనం
నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్, ఐవోసీ, బజాజ్‌ ఆటో, ఎస్‌బీఐ 3.4-1.5 శాతం మధ్య నష్టపోగా.. కోల్‌ ఇండియా, టైటన్‌, యస్‌ బ్యాంక్‌, విప్రో, జీ, ఇన్ఫోసిస్‌ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1.2-0.4 శాతం మధ్య బలపడ్డాయి. ఇక ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో ఆర్‌ఈసీ, ఎన్‌ఎండీసీ, దివాన్‌ హౌసింగ్‌, పీవీఆర్‌, మహానగర్‌ గ్యాస్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, హెక్సావేర్‌ 4.3-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోవైపు ఇండిగో 12 శాతం కుప్పకూలగా.. అరవింద్‌, బిర్లా సాఫ్ట్‌, అదానీ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ కేపిటల్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, ఎన్‌సీసీ 8-4 శాతం మధ్య పతనమయ్యాయి. 

మిడ్‌ క్యాప్స్‌ డౌన్‌
మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.6-0.4 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ 1226 షేర్లు నష్టపోగా.. 863 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో టీఎఫ్‌సీఐ, న్యూలాండ్‌, రెడింగ్టన్‌, స్వెలెక్ట్‌, హైటెక్ గేర్‌, వెలెంట్‌, రుషిల్‌, అషాహీ, ఐఎస్‌ఎఫ్‌టీ, యారోగ్రీన్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, మన్‌పసంద్‌, మొహతా, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, ఈరోస్‌ తదితరాలు 10-5 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');