మన్‌పసంద్‌- టీసీఎస్‌.. నేలచూపు

మన్‌పసంద్‌- టీసీఎస్‌.. నేలచూపు

గతేడాది ఆడిటర్లు రాజీనామా చేయడంతో కొత్తగా ఎంపిక చేసుకున్న ఆడిటింగ్ సంస్థ సైతం తాజాగా తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో పానీయాల సంస్థ మన్‌పసంద్‌ బెవరేజెస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. కాగా.. మరోపక్క సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను కొంతమేర నిరాశపరచడంతో నేలచూపులతో కదులుతోంది. వివరాలు  చూద్దాం..

మన్‌పసంద్‌ బెవరేజెస్‌
కంపెనీ ప్రాముఖ్యత కలిగిన సమాచారాన్ని అందించడంలేదన్న కారణంగా 2018 మే నెలలో డెలాయిట్‌ హస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌ ఆడిటర్‌గా రాజీనామా చేశాక పతన బాట పట్టిన మన్‌పసంద్‌ బెవరేజెస్‌ షేరు ఇటీవల తిరిగి కోలుకుంటూ వస్తోంది. అయితే దాదాపు ఏడాది క్రితం ఆడిటర్‌గా బాధ్యతలు స్వీకరించిన మెహ్రా గోయల్‌ అండ్‌ కో సైతం తాజాగా కంపెనీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో మన్‌పసంద్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం పతనమై రూ. 39 దిగువన ఫ్రీజయ్యింది. 

Related image
 
టీసీఎస్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్)లో సాధించిన ఫలితాలు ఆకట్టుకోకపోవడంతో సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల టాటా గ్రూప్‌ దిగ్గజం టీసీఎస్‌ కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో తొలుత ఎన్‌ఎస్ఈలో టీసీఎస్‌ షేరు 3 శాతం క్షీణించి రూ. 2071ను తాకింది. ప్రస్తుతం కాస్త కోలుకుని 1.4 శాతం నష్టంతో రూ. 2104 వద్ద ట్రేడవుతోంది. క్యూ1లో టీసీఎస్‌ నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 8131 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం సైతం త్రైమాసిక ప్రాతిపదికన నామమాత్ర వృద్ధితో రూ. 38,172 కోట్లకు చేరింది. ఇబిట్‌ 3 శాతం క్షీణించి రూ. 9220 కోట్లకు పరిమితమైంది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');