మార్కెట్లు పడుతున్నాయా? 7-12 శాతం రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఇవే!!

మార్కెట్లు పడుతున్నాయా? 7-12 శాతం రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఇవే!!

ఈ వారం ఆరంభం నుండి దేశీ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. బడ్జెట్ ప్రభావం, గ్లోబల్ మార్కెట్ల అనిశ్ఛితి మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఇక బుధవారం నాటి మార్కెట్లు కూడా ఫ్లాట్‌గానే ప్రారంభమయ్యాయి. మంగళవారం నాటి ముగింపు సమయానికి S&P BSE సెన్సెక్స్ కేవలం 10 పాయింట్లు పెరిగి 38,730 వద్ద ముగిసింది. నిఫ్టీ 2.7 పాయింట్లు నష్టపోయి 11,555 వద్ద నిలిచింది. SGX నిఫ్టీ ట్రెండ్స్ ప్రకారం బుధవారం నాటి మార్కెట్లో ప్రతికూలతలే కనిపిస్తున్నాయని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. మంగళ వారం నాటి మార్కెట్లలో ఫారిన్ ఇన్వెస్టర్లు (FPIs) రూ. 674 కోట్ల విలువైన స్టాక్స్ ను వదలించుకుంటే.. (DIIs ) దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 710 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని సెబీ వెల్లడించింది. 
ఐటీ దిగ్గజం TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ) తన జూన్ 2019 వరకు ముగిసిన త్రైమాసిక ఫలితాల వెల్లడిలో నెట్ ప్రాఫిట్ రూ. 8,131 కోట్లుగా పేర్కొంది. మరో రెండు ఐటీ కంపెనీల క్వార్టర్ ఫలితాలు వెల్లడి కానుండటంతో ఈ వారం ఐటీ షేర్లు మంచి ప్రభావం చూపించవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. జెఫ్రీస్ బ్రోకింగ్ సంస్థ TCS కు " బయ్‌ "కాల్‌ను ఇచ్చింది. టార్గెట్ ప్రైస్‌ రూ. 2380 గా పేర్కొంది. అలాగే TCS షేర్‌ మీద HSBC సంస‌్థ  "హోల్డ్ "  కాల్‌ ఇస్తూ.. టార్గెట్ ప్రైస్ రూ. 1900గా పేర్కొంది. 
ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ (ఇండిగో ) డైరెక్టర్ల రాజీనామాలు, సంస్థలో నిర్వాహణా లోపాలపై సెబీకి ఫిర్యాదు చేయడంతో ఆ స్టాక్స్ కుప్పకూలాయి. సిటీ గ్రూప్ సంస్థ  ఇండిగో స్టాక్స్ మీద " సెల్ " కాల్‌ ఆప్షన్‌ ను ఇచ్చింది. 
ఇక ఈ వారం మార్కెట్లు ఎలా స్పందించినా కొన్ని స్టాక్స్ మాత్రం 7 నుండి 12 శాతం రిటర్న్స్ ను అందిస్తాయని SMC  గ్లోబల్ సెక్యూరిటీస్ సంస్థ టెక్నికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. అవేంటో చూద్దాం.

ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ : టార్గెట్ ప్రైస్ రూ. 276 : స్టాప్ లాస్ రూ. 310
శోభా లిమిటెడ్ :  Buy  : టార్గెట్ ప్రైస్ రూ. 622 :  స్టాప్ లాస్ రూ. 520 : వృద్ధి 11 శాతం
మాజెస్కో (Majesco) లిమిటెడ్ ; Buy : టార్గెట్ ప్రైస్ రూ. 611 : స్టాప్ లాస్ రూ. 510: వృద్ధి 12శాతం